
కీర్తి ఆజాద్ కీర్తి పెరిగింది...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి సగటుజీవి వరకు స్పందిస్తున్నారు.
జైట్లీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు చర్య తీసుకున్నారా? అని పశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే, 1983లో భారత క్రికెట్‌లో రాణించిన నాటికన్నా ఇప్పుడే కీర్తి ఆజాద్ పాపులారిటీ పెరిగిందని సోషల్ మీడియా వ్యాఖ్యానించింది.
కీర్తి ఆజాద్ అంశాన్ని చర్చించేందుకు సమావేశమైన ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలాంటి పార్టీ పెద్ద తలకాయలు పార్టీ నిర్ణయాన్ని ఎలా సమర్థించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట!