కీర్తి ఆజాద్ కు బీజేపీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ : పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్కు భారతీయ జనతా పార్టీ శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆయనను సూచించింది. షోకాజ్ నోటీసుపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కీర్తి ఆజాద్ ను ఆదేశించింది.
కాగా డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జైట్లీని ప్రాసిక్యూట్ చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు నివేదిక సిఫారసు చేసిందని ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీర్తి ఆజాద్ కు నోటీసులు జారీ చేసింది.