'అండర్సన్ కాదు.. బ్యాండర్ సన్'
న్యూఢిల్లీ: పటౌడీ సిరీస్ భాగంగా ఇంగ్లాండ్ జరుగుతున్న భారత పర్యటన హాట్ టాపిక్ గా మారింది. భారత ఆటగాడు రవీంద్ర జడేజా, ఇంగ్లాడ్ బౌలర్ అండర్సన్ ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ తీవ్రంగా స్పందించారు.
జడేజాపై దురుసుగా ప్రవర్తించిన అండర్సన్ పై నిషేధం విధించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. అండర్సన్ పై నిషేధం విధించి బ్యాండర్ సన్ ('Ban'derson) గా మార్చాలని ఆజాద్ వ్యాఖ్యానించారు.
నాటింగ్ హామ్ టెస్టు రెండో రోజు లంచ్‌కు ముందు ఆఖరి బంతికి అండర్సన్... జడేజా అవుట్ అంటూ అప్పీలు చేశాడు. దీనిని అంపైర్ తోసిపుచ్చారు. ఆ వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు లంచ్‌కు వెళ్లే సమయంలో ‘నీ ప్యాంట్ నుంచి వాసన వస్తోంది.., నీ చెవికి ఆ పోగులెందుకు’... అంటూ అండర్సన్ దూషణకు దిగడంతో పాటు జడేజాను తోసేయడం వివాదంగా మారింది.