ఢిల్లీ: బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న కరోనా కేసులు రావడంతో ఇక ఈ లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లు ఎంతవరకూ జరుగుతాయనే సందిగ్థత ఏర్పడింది. మరొకవైపు మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ను ఆపితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను ముందుగా అనుకున్నది బయోబబుల్‌లో ఐపీఎల్‌ను జరుపుతున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉండదనే అనుకున్నా క్రికెటర్లంతా సేఫ్‌గానే ఉంటారని భావించా. కానీ దురదృష్టవశాత్తూ బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నా క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. అంటే రక్షణ లేదనేది ఇక్కడ అర్థమవుతోంది. రాబోవు కాలంలో పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు. మరి ఈ తరుణంలో ఐపీఎల్ అవసరమా.. ఇక ఆపండి’ అని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ చదవండి: విరాళంపై రూటు మార్చిన కమిన్స్!
‘ఇకపై వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేం’
Comments
Please login to add a commentAdd a comment