Photo Courtesy: IPL
ఢిల్లీ: ఐపీఎల్‌కు కరోనా సెగ తాకినట్లే కనబడుతోంది. బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడం, ఆపై ఆ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లడం జరిగాయి. ఫలితంగా సోమవారం(మే3వ తేదీ) ఆర్సీబీ-కేకేఆర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా స్పష్టత లేదు. ఇదిలాఉంచితే, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌లోనూ కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆదివారం వచ్చిన ఫలితాల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడినట్లు సమాచారం. సీఎస్‌కే జట్టులో మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వీరికి నెగిటివ్ వస్తే కానీ బయోబబుల్‌లో చేరడానికి అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఎంత బయోబబుల్‌లో ఉన్నా కరోనా సోకడం ఆయా ఫ్రాంచైజీలను కలవర పరుస్తోంది. ఐపీఎల్ మధ్యలో ఉండటంతో ఏం చేయాలనే దానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై త్వరలో స్పష్టత రావొచ్చు. ఒకవేళ ఐపీఎల్ జట్టు సభ్యులు ఇలానే కరోనా బారిన పడుతూ ఉంటే మాత్రం టోర్నీని రద్దు చేయడం కంటే మంచి మార్గం లేదు.
ఇక్కడ చదవండి: ఐపీఎల్ రద్దు తప్పదా?
ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా!
Comments
Please login to add a commentAdd a comment