
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కుటుంబంలో కరోనా కలకలం రేపింది. మిస్టర్ కూల్ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్ సింగ్ కోవిడ్-19 బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కే కెప్టెన్‌గా బిజీగా ఉన్నాడు. నేడు చెన్నై, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
ఇక, బయో బబుల్ నిబంధనల నడుమ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే, ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్ లీగ్ దశలోనే వెనుదిరగడం టోర్నీ చరిత్రలో అదే మొదటిసారి. టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వాత ధోని కుటుంబానికే సమయం కేటాయించాడు.
చదవండి: ధోని.. 21 నెలలు ఆలస్యమైంది!
Comments
Please login to add a commentAdd a comment