అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే | Kejriwal, Azad in habit of making false statements: DDCA to HC | Sakshi
Sakshi News home page

అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే

Published Wed, Nov 9 2016 7:17 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే - Sakshi

అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సస్పెండ్కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్లకు తప్పుడు ప్రకటనలు చేయడం, ఎదుటివారికి మచ్చతెచ్చేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారిందని ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) హైకోర్టుకు వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ ఏకే సిసోడియా ముందు కొన్ని పత్రాలను కూడా బుధవారం సమర్పించింది.

తమ వ్యవహారాల్లో తలదూర్చి పనితీరును, ఆర్థిక వ్యవహారాలను తప్పుబడుతూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ ప్రకటనలు చేశారని డీడీసీఏ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలు ఖండించకపోగా తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు అంటూ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఆజాద్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ కోరగా మీడియా ముందుకు ఎప్పుడు వెళ్లినా పక్కవారి గౌరవానికి భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ మాట్లాడతారని అది వారిద్దరికి అలవాటుగా మారిందని డీడీసీఏ బుధవారం ఆరోపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement