'జైట్లీకి సిగ్గులేదు' | Jaitley a shameless man, hundreds of allegations against him: Ram Jethmalani | Sakshi
Sakshi News home page

'జైట్లీకి సిగ్గులేదు'

Published Wed, Dec 23 2015 6:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'జైట్లీకి సిగ్గులేదు' - Sakshi

'జైట్లీకి సిగ్గులేదు'

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. జైట్లీ ఓ సిగ్గులేని వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. అలాగే జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో పోల్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన దుయ్యబట్టారు. 'నరేంద్రమోదీ తానే అంతా అనుకొని జైట్లీని అద్వానీతో పోలుస్తున్నారు. జైట్లీ ఓ సిగ్గులేని మనిషి. అతనిపై వందలాది ఆరోపణలు ఉన్నాయి' అని రామ్‌జెఠ్మలానీ విమర్శించారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న రామ్‌జెఠ్మలానీ జైట్లీ తీరును తప్పుబట్టారు.

హవాలా కుంభకోణం కేసులో అద్వానీ తరఫున తాను వాదించడం వల్లే ఆయన విజయం సాధించారని, ప్రస్తుతం తాను కేజ్రీవాల్‌ దన్నుగా పరువునష్టం కేసులో జైట్లీని ప్రాసిక్యూట్ చేయబోతున్నానని, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు గుర్తించవచ్చునని ఆయన చెప్పారు. అందరూ తప్పు చేస్తారని, కానీ తనకు జైట్లీ అంటే ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement