false statements
-
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న ‘జగనన్న విద్యాకానుక’పై ఏడుపుగొట్టు కథనాలతో ఈనాడు మరోసారి తన నైజాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగా విద్యాకానుక గుత్తేదార్లకేనంటూ ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ‘ఫ్యాక్ట్ చెక్’లో వెల్లడైంది. గతంలోనూ ఇదే తరహా కథనాలు ప్రచురించడం తెలిసిందే. ఈనాడు ఆరోపణ: ఈసారి బూట్లపై రూ.14 అధికం వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక జత బూట్లు, 2 జతల సాక్సుల కొనుగోళ్లకు ఆమోదించిన వ్యయం రూ.200. అయితే రివర్స్ టెండర్లతో రూ.187.48కే టెండర్ ఖరారు చేశారు. ఇది ప్రభుత్వం ఆమోదించిన ధర కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం ఆరోపణ: బ్యాగ్‌పై సగటున రూ.92 అధికం వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక్కో బ్యాగు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆమోదించిన వ్యయం రూ.265.50. మొదటిసారి టెండర్లలో కాంట్రాక్టర్లు 30 శాతం అధికంగా రేటు కోట్ చేయడంతో వాటిని రద్దు చేసి రెండోసారి పిలిచారు. రివర్స్ టెండర్ల ద్వారా నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో బ్యాగును రూ.272.92 చొప్పున ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇది కేవలం 2.43 శాతం అధికం. బ్యాగు నాణ్యత పెరగడంతో ప్రభుత్వం అనుమతించిన గరిష్ట పరిమితి యూనిట్ వ్యయం 5 శాతం మించకుండా టెండర్లు ఖరారు చేశారు. ఆరోపణ: చిరిగిన బ్యాగ్‌ల సరఫరాపై చర్యలు శూన్యం వాస్తవం: జగనన్న విద్యాకానుక 3వ విడతలో చిరిగిన, పాడైన బ్యాగులకు సంబంధించి జేవీకే యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అలాంటి బ్యాగులు రీప్లేస్ చేయని సరఫరాదారులకు ఆ మేరకు చెల్లింపులు నిలిపివేశారు. ఆరోపణ: ముగ్గురు పాత కాంట్రాక్టర్లే వాస్తవం: టెండర్ నిబంధనల ప్రకారం అనుమతించారు. కొత్త కాంట్రాక్టర్లు కూడా పాల్గొనేలా అవకాశం కల్పిస్తూ బ్యాగులు, బూట్లకు సంబంధించి పెద్ద టెండర్లను ఐదు రీజియన్లుగా విభజించి పిలిచారు. దీనివల్ల ఏకపక్ష ఆధిపత్యం ఉండదు. ఆరోపణ: బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. వాస్తవం: ప్రభుత్వం అనుమతించిన మేరకు మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కేవలం ఒక్క శాతం పెరుగుదలతో మాత్రమే టెండర్లను ఖరారు చేశారు. ఆరోపణ: విద్యార్థులు తగ్గినా రూ.155.84 కోట్లు అదనపు భారం వాస్తవం: యూడైస్ గణాంకాల ఆధారంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 శాతం పెరుగుదల లెక్కించి టెండర్లు ఆహ్వానిస్తుంటారు. డెలివరీ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు మాత్రం విద్యార్థుల యథార్థ సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం 39,96,064 మంది విద్యార్థులను పరిగణనలోకి తీసుకుని సరఫరా షెడ్యూల్ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతించిన విధంగా 5శాతానికి మించకుండా టెండర్లు ఖరారు చేశారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన వ్యయం కంటే తక్కువ బడ్జెట్లోనే విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. -
తప్పుడు ప్రకటనల్లో ట్రంప్ రికార్డు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ 8,158 సార్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అధ్యక్షుడిగా ట్రంప్ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫ్యాక్ట్ చెకర్స్ డేటాబేస్’అనే కంపెనీ ట్రంప్ చేసిన ప్రతీ అనుమానిత తప్పుడు సమాచారాన్ని విశ్లేషించింది. తొలి ఏడాదిలో రోజుకు సరాసరి 5.9 తప్పుడు ప్రకటనలు చేశారని, రెండో ఏడాదికి వచ్చే సరికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి, రోజుకు 16.5 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పేర్కొంది. మొత్తం 8,158 తప్పుడు ప్రకటనల్లో దాదాపు 6 వేలకు పైగా ప్రకటనలు రెండో ఏడాదే చేశారని తెలిపింది. అధ్యక్షుడైన తర్వాత తొలి 100 రోజుల్లోనే 492 తప్పుడు ప్రకటనలు చేశారని తేల్చింది. ఇప్పటి వరకు చేసిన తప్పుడు ప్రకటనల్లో అధికంగా వలసల గురించే చేయడం గమనార్హం. విదేశీ విధానం గురించి 900, వాణిజ్యం గురించి 854, ఆర్థిక వ్యవస్థ గురించి 790, ఉద్యోగాల గురించి 755 తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ రెండేళ్లలో 82 రోజులు మాత్రమే ఎలాంటి ప్రకటనలు చేయలేదు. -
అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సస్పెండ్‌కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌లకు తప్పుడు ప్రకటనలు చేయడం, ఎదుటివారికి మచ్చతెచ్చేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారిందని ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) హైకోర్టుకు వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ ఏకే సిసోడియా ముందు కొన్ని పత్రాలను కూడా బుధవారం సమర్పించింది. తమ వ్యవహారాల్లో తలదూర్చి పనితీరును, ఆర్థిక వ్యవహారాలను తప్పుబడుతూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ ప్రకటనలు చేశారని డీడీసీఏ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలు ఖండించకపోగా తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు అంటూ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఆజాద్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ కోరగా మీడియా ముందుకు ఎప్పుడు వెళ్లినా పక్కవారి గౌరవానికి భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ మాట్లాడతారని అది వారిద్దరికి అలవాటుగా మారిందని డీడీసీఏ బుధవారం ఆరోపించింది.