పన్నీర్‌ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ? | Main opponent is DMK, not #OPaneerselvam. ops is zero PS: TTV Dinakaran | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ?

Mar 9 2017 2:52 PM | Updated on Aug 30 2018 6:07 PM

పన్నీర్‌ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ? - Sakshi

పన్నీర్‌ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ?

తమ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీయేనని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ వ్యాఖ్యానించారు.

చెన్నై : తమ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీయేనని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు పన్నీర్‌ సెల్వం తమకు పోటీ కాదని, ఆయన సున్నఅని దినకరన్‌ అభివర్ణించారు. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంకు ఖాళీ ఏర్పడింది.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 12న ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు ఆర్కేనగర్‌ స్థానం నుంచే పోటీకి దిగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే అధికార అన్నాడీఎంకేతో పాటు పన్నీర్‌ సెల్వం, డీఎంకేలు ఈ స్థానంపై కన్నేయడంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement