
నా ఎన్నిక సక్రమమే: శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ నియమ నిబంధనలకు లోబడే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తన నియామకం జరిగిందని ప్రధాన ఎన్నికల సంఘాని(ఈసీ)కి శశికళ లేఖ రాశారు. దీనిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ద్వారా ఆమె ఈసీకి అందజేశారు.
పార్టీలో ఐదేళ్లపాటు నిరంతర సభ్యత్వం లేకుండా ఎన్నికైనందున, శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో శశికళకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఈనేపథ్యంలో దినకరన్ ద్వారా శశికళ ఈసీకి వివరణ ఇచ్చారు. మరోవైపు, జయలలిత మరణంపై పలు అనుమానాలున్నందున సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర మాజీ సీఎం పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌కి వినతిపత్రం సమర్పించారు.