ఇద్దరు మంత్రులపై కేసు ? | case filed on two ministers? | Sakshi
Sakshi News home page

ఇద్దరు మంత్రులపై కేసు ?

Published Fri, Apr 14 2017 7:30 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

ఇద్దరు మంత్రులపై కేసు ?

ఇద్దరు మంత్రులపై కేసు ?

► విచారణాధికారిగా ఏఎస్పీ శంకర్‌
► మంత్రి విజయభాస్కర్‌కు సమన్లు


సాక్షి ప్రతినిధి, చెన్నై:  వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదనపు పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ను విచారణాధికారిగా కమిషనర్‌ కరణ్‌ సిన్హా నియమించారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్‌ ఇంటి నుంచే నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన రాష్ట్రం నలుమూలలా ఐటీ దాడులు సాగాయి. ఈ సమయంలో మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించినట్లుగా చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఐటీ ఉన్నతాధికారులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్‌ మంత్రులపై కేసు నమోదుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగానే అదనపు పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ నేతృత్వంలో సంఘటనపై విచారణ జరిపేందుకు కమిషనర్‌ నిర్ణయించారు.  ఇదిలా ఉండగా, దాడుల తరువాత కార్యాలయానికి ఐటీ కార్యాలయంలో హాజరైన మంత్రి విజయభాస్కర్‌కు మరలా సమన్లు పంపారు. ఈ సమన్ల ప్రకారం శుక్రవారం ఉదయం అధికారుల విచారణకు మంత్రి మరోసారి హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలను చూపి మంత్రి హాజరుకాలేదు. మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్‌కుమార్‌ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు

మంత్రికి దినకరన్‌ బాసట
మంత్రి విజయభాస్కర్‌కు క్యాబినెట్‌ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ఆయనకు బాసటగా నిలిచారు. మంత్రి విజయభాస్కర్‌ను పదివి నుంచి తప్పించడమో లేక రాజీనామా కోరడమో అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దినకరన్‌ గెలుపు కోసమే మంత్రి నగదు పంపిణీ చేసిన సంగతి పాఠకులకు విదితమే. తన గెలుపుకోసం ఐటీ ఉచ్చులో పడి అవస్థలు పడుతున్న మంత్రికి ఆయన భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement