kamaraj
-
ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ!
ప్రతీయేటా జూలై 15న స్వాతంత్ర్యసమరయోధుడు, రాజనీతిజ్ఞుడు కుమారస్వామి కామరాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. కామరాజ్ రాజకీయ చతురతకు పేరుగాంచారు. జవహల్‌లాల్ నెహ్రూ మరణాంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కామరాజ్ పార్టీకి సారధ్యం వహించారు. కామరాజ్ తనకు ప్రధానమంత్రికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా ఆ అవకాశాన్ని లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీలకు కల్పించడంలో ప్రధాన భూమిక వహించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి నాటి రోజుల్లో ఒక నేతగా, ముఖ్యమంత్రిగా కామరాజ్ మద్రాస్(ప్రస్తుతం తమిళనాడు)లో విశేష రీతిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఆయన భారీగా పెట్టుబడులు కేటాయించారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. ఇందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం దోహదపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్న పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నారు. కామరాజ్ జన్మదినాన తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ‘ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డే’ని నిర్వహిస్తుంటారు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే.. కామరాజ్ నాడార్ (వెనుకబడిన కులం) కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి కాకుండానే తన 11 సంవత్సరాల వయస్సులో మదురై సమీపంలోని తన మామ కిరాణా దుకాణంలో పని చేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలపై, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్‌ను నాటి జలియన్‌వాలాబాగ్ ఊచకోత అమితంగా కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్‌గా చేరిన కామరాజ్ 1940లో పార్టీ మద్రాసురాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ కామరాజ్‌ను మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలోనే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరిపించి.. 1952లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది సి రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడిని (కామరాజ్) నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఆ పదవిని అధిష్టించిన కామరాజ్ తొలుత 1953లో రాజాజీ ప్రవేశపెట్టిన కుల ఆధారిత సవరించిన ప్రాథమిక విద్య పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. తన పదవీకాలంలో 12,000 పాఠశాలలను నిర్మించారు. 11వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. పార్టీకి కలసివచ్చిన కామరాజ్ ప్రణాళిక 1963లో నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలోనూ మెదిలింది. అప్పుడే పార్టీని పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు కామరాజ్ ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వంలో ఉన్న నేతలు సంస్థాగత పనులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. 1963 ఆగస్టు 10న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో కామరాజ్ ప్రణాళిక ఆమోదం పొందింది. శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ 1964 మే 27న నెహ్రూ మరణించారు. నెహ్రూ లాంటి వారు మరొకరు లభ్యం కారని భావించిన కామరాజ్ వివాద రహిత నేత లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కామరాజ్ పార్టీని సమాఖ్య నాయకత్వ వ్యవస్థ వైపు నడిపించడానికి ప్రయత్నించారు. 1966లో శాస్త్రి కన్నుమూశారు. అనంతరం గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ, శాస్త్రిలను కోల్పోయిన క్లిష్ట సమయాలను కాంగ్రెస్ అధిగమించేందుకు కామరాజ్ విశేష కృషి చేశారు. అనంతరం శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నుకోవడంలో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. 1966 జనవరి 24న ఇందిర ప్రధాని పదవిని అలంకరించారు. 72 ఏళ్ల వయసులో కన్నుమూత ఇందిరాగాంధీ పదవిలో ఉన్న సమయంలో ఆమె మద్దతుదారులకు, మరికొందరు పార్టీ నేతలకు మధ్య విబేధాలు పొడచూపాయి. ఇది చివరకు 1969లో పార్టీ చీలికకు దారితీసింది. పార్టీపై కామరాజు ప్రభావం తగ్గిపోయింది. 1967 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించింది. కామరాజ్ ఓటమి పాలయ్యారు. 1971లో ఇందిరను ఓడించాలని భావించిన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇందిరా కాంగ్రెస్ (రిక్విజిషన్) కాంగ్రెస్ (ఓ)ని ఘోరంగా ఓడించింది. కామరాజ్ 1975లో తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
పెళ్లి వద్దనుకున్న ఫ్రీడమ్ ఫైటర్
కె. కామరాజ్‌గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ స్వాతంత్య్రోద్యమ నాయకుడు. ‘భారతరత్న’ పురస్కార విజేత. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి,పెళ్లి కూడా చేసుకోలేదు. కామరాజ్ మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కామరాజ్, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితులు. నెహ్రూ మరణం తర్వాత 1964లో లాల్ బహదూర్ శాస్త్రిని, ఆయన తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధానులను చేయటంలో కామరాజ్ ప్రధానపాత్ర పోషించారు. కామరాజ్ అనుయాయులు అభిమానంగా ఆయన్ని దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. 1957లో కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశం కల్పించారు. నేడు కామరాజ్ జయంతి. 1903 జూలై 15న ఆయన జన్మించారు. (చదవండి: విధి నిర్వహణలో నెహ్రూ నుంచి ప్రశంసలు అందుకున్న దుర్గాబాయ్) -
కామరాజు భూకబ్జాపై సుప్రీంకోర్టు సీరియస్
తమిళనాడు: తమిళనాడు మంత్రి కామరాజు భూకబ్జా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసుల అలసత్వంపై కోర్టు మండిపడింది. చట్టంకంటే మంత్రి ఎక్కువా అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ ఘటనపై సోమవారంలోగా సమగ్ర నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. భూవివాదంలో తన వద్ద డబ్బు తీసుకున్నాడని తిరువరుర్కు చెందిన ఎస్వీఎస్ కుమార్ అనే వ్యక్తి మంత్రిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఇద్దరు మంత్రులపై కేసు ?
► విచారణాధికారిగా ఏఎస్పీ శంకర్ ► మంత్రి విజయభాస్కర్‌కు సమన్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదనపు పోలీస్ కమిషనర్ శంకర్‌ను విచారణాధికారిగా కమిషనర్ కరణ్ సిన్హా నియమించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచే నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన రాష్ట్రం నలుమూలలా ఐటీ దాడులు సాగాయి. ఈ సమయంలో మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించినట్లుగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఐటీ ఉన్నతాధికారులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ మంత్రులపై కేసు నమోదుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నేతృత్వంలో సంఘటనపై విచారణ జరిపేందుకు కమిషనర్ నిర్ణయించారు. ఇదిలా ఉండగా, దాడుల తరువాత కార్యాలయానికి ఐటీ కార్యాలయంలో హాజరైన మంత్రి విజయభాస్కర్‌కు మరలా సమన్లు పంపారు. ఈ సమన్ల ప్రకారం శుక్రవారం ఉదయం అధికారుల విచారణకు మంత్రి మరోసారి హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలను చూపి మంత్రి హాజరుకాలేదు. మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్‌కుమార్ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు మంత్రికి దినకరన్ బాసట మంత్రి విజయభాస్కర్‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆయనకు బాసటగా నిలిచారు. మంత్రి విజయభాస్కర్‌ను పదివి నుంచి తప్పించడమో లేక రాజీనామా కోరడమో అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దినకరన్ గెలుపు కోసమే మంత్రి నగదు పంపిణీ చేసిన సంగతి పాఠకులకు విదితమే. తన గెలుపుకోసం ఐటీ ఉచ్చులో పడి అవస్థలు పడుతున్న మంత్రికి ఆయన భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేశారు. -
కామరాజ్ జీవిత చిత్రంలో సముద్రకని
దక్షిణాదిన పేరున్న ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు కీర్తిశేషులు కామరాజ్ నాడార్. సీనియర్ కాంగ్రెస్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన జీవితంపై సినిమా ఇప్పుడు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సముద్రకని నటిస్తున్నారు. తెలుగు సినిమాలు ‘నాలో...’ (2004), ‘శంభో శివ శంభో’ (2010)కు గతంలో దర్శకత్వం వహించిన సముద్రకని ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’ చిత్రానికి నిర్దేశకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కామరాజ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో ఎస్టేట్ డ్యూటీ అధికారిగా సముద్రకని కీలక సన్నివేశాల్లో కనిపించనున్నారు. కామరాజ్ మరణానంతరం ఆయన ఇంటికి వచ్చే పాత్ర అది. ఈ పాత్రకు అడగగానే, ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించినట్లు దర్శకుడు ఎ. బాలకృష్ణన్ చెప్పారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జీవితంపై ‘ముదల్వర్ మహాత్మా’ కూడా తీసిన అనుభవం బాలకృష్ణన్‌కు ఉంది. చిత్రం ఏమిటంటే, తమిళ ప్రజలు ఆరాధ్య నేతగా కొలిచే కామరాజ్ జీవితంపై ఈ సినిమా నిజానికి పదేళ్ళ క్రితం ఒకసారి రిలీజైంది. ఇప్పుడు కొత్తగా మరో 15 సీన్లు చిత్రీకరించి కలపడమే కాకుండా, పాత సినిమాను డిజిటల్‌గా పునరుద్ధరించి రిలీజ్ చేయనున్నారు. ఈ కొత్త సీన్లలోనే సముద్రకని కనిపిస్తారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కామరాజ్ లాంటి నేతల జీవితకథలు సినిమాగా యువతరానికి ప్రేరణనివ్వడం కోసమే. ఈ పునఃచిత్రీకరణ, రీ-రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ‘‘రాజకీయాల్లోని చీకటి కోణమే తెలిసిన ఈనాటి యువతరానికి కామరాజ్ జీవితం తెలిపే సినిమా కావడంతో, ఆనందంగా నటించడానికి అంగీకరించాను’’ అని సముద్రకనిత అన్నారు. చారుహాసన్ లాంటి పలువురు నటించిన ఈ ‘కామరాజ్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు కావడం మరో విశేషం.