తమిళనాడు: తమిళనాడు మంత్రి కామరాజు భూకబ్జా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసుల అలసత్వంపై కోర్టు మండిపడింది.
చట్టంకంటే మంత్రి ఎక్కువా అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ ఘటనపై సోమవారంలోగా సమగ్ర నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. భూవివాదంలో తన వద్ద డబ్బు తీసుకున్నాడని తిరువరుర్‌కు చెందిన ఎస్‌వీఎస్ కుమార్ అనే వ్యక్తి మంత్రిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కామరాజు భూకబ్జాపై సుప్రీంకోర్టు సీరియస్
Published Wed, May 3 2017 12:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement