హైదరాబాద్‌కు దినకరన్‌ ఎమ్మెల్యేలు | Dinakaran MLAs to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు దినకరన్‌ ఎమ్మెల్యేలు

Published Sun, Sep 3 2017 1:21 AM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

హైదరాబాద్‌కు దినకరన్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌కు దినకరన్‌ ఎమ్మెల్యేలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అన్నాడీఎంకే దినకరన్‌ వర్గ 19 మంది ఎమ్మెల్యేలు తమ మకాంను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు మారుస్తున్నారు. పళని వర్గ ప్రలోభాలకు గురికాకుండా దినకరన్‌ తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచి కాపాడుతున్నారు.

శని లేదా ఆదివారం వారందరినీ దినకరన్‌ హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు మంగళవారం 19 మంది శాసనసభ్యులు స్పీకర్‌ను విడివిడిగా కలుస్తారని దినకరన్‌ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌ సెల్వన్‌ తెలిపారు. శశికళ కుటుంబంపై దివంగత సీఎం జయలలిత చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను మంత్రి ఉదయకుమార్‌ రిలీజ్‌చేయగా, ప్రతిగా దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు మరో వీడియో రిలీజ్‌చేశారు. పెరియకుళం ఎంపీగా దినకరన్‌ పోటీచేసినపుడు అతణ్ని, శశికళను జయ పొగిడిన దృశ్యం ఈ వీడియోలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement