ఎమీకి రాజకీయ రంగు! | Amy Jackson to campaign for TTV Dinakaran in RK Nagar? | Sakshi
Sakshi News home page

ఎమీకి రాజకీయ రంగు!

Published Fri, Mar 31 2017 2:18 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

ఎమీకి రాజకీయ రంగు! - Sakshi

ఎమీకి రాజకీయ రంగు!

నటి ఎమీజాక్సన్‌కు రాజకీయరంగుపులమనున్నారా? అలాంటి పరిస్థితి కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.రాజకీయ వర్గాలు సినీ గ్లామర్‌ను వాడుకోవడం ఇవాళ కొత్తేమీ కాదు. అలాగే సినిమా వాళ్లకు రాజకీయ రంగు అనాధిగా పడుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ రాజకీయాలు ఇటీవల కన్ను మూసిన జయలలిత వరకూ సినిమా వారి చుట్టూనే తిరిగాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నియోజక స్థానాన్ని భర్తీ చేయడానికి సినీ గ్లామర్‌ అవసరంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

అన్నాడీఎంకే రెండు పార్టీలుగా చీలిపోయి ఆర్‌కే.నగర్‌లో పోటీ చేస్తూ గెలుపు కోసం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అమ్మ అన్నాడీఎంకే తరఫున టీటీవీ.దినకరన్‌ బరిలో ఉన్నారు.ఈ స్థానాన్ని ఎలాగైనా సాధించాలన్నదే ధ్యేయంగా పోటీలో ఉన్న అన్ని పార్టీలు పరితపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అన్నాడీఎంకే పార్టీ తరఫున ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ను ప్రచారానికి వాడుకోవాలని ఆ పార్టీ వర్గాలు భావించినట్లు, అందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు టాక్‌. ఎందరో సినీ ప్రముఖులుండగా నటి ఎమీపైనే వీరి కన్ను పడడానికి కారణం లేకపోలేదు. ఈ అమ్మడు మదరాసు పట్టణం చిత్రం ద్వారా నటిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విషయం తెలిసిందే.

అందులో ఆమె చాలా వరకూ టోపీ పెట్టుకునే అందంగా కనిపించింది. ఇక అమ్మ అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు టోపీ అన్నది తెలిసిందే. దీంతో అలాంటి గోపీని పెట్టుకుని నటి ఎమీజాక్సన్‌ను తమ పార్టీ తరుఫున ప్రచారం చేయవలసిందిగా ఎమీజాక్సన్‌ను కోరినట్లు, అందుకు ఈ బ్యూటీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అన్నది ఎమీ ప్రచారానికి బయలుదేరే వరకూ వేచి ఉండాల్సిందే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో మెరవనున్న ఈ జాణ ప్రస్తుతం కాళీగానే ఉందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement