
ఇక దినకరన్!
► ఉప కార్యదర్శి ఇంటి వైపు ఎమ్మెల్యేలు
► మంతనాల జోరు .. ఆగస్టు ఐదున నిర్ణయం
► కేంద్రంపై సెటైర్లతో ముందుకు
అన్నాడీఎంకేలో విలీన చర్చ మళ్లీ తెర మీదకు వస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ తన తంత్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఆయన మద్దతుదారులతో మంతనాల్లో ఉన్న దినకరన్ ఆగస్టు ఐదో తేదీ నుంచి పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల్ని ఏకం చేయడానికి తగ్గ కసరత్తులు మళ్లీ తెర మీదకు రావడంతో దినకరన్ రంగంలోకి వచ్చారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పార్టీలో తాజా పరిణామాలు ఎలా ఉంటాయో అనే ప్రశ్న తలెత్తింది. అన్నాడీఎంకే నుంచి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను ఎప్పుడో బహిష్కరించినట్టుగా అమ్మ శిబిరం మంత్రులు ఆమోదించి ఆరునెలల క్రితం కేంద్రానికి పంపారు.
అయితే ఈ తీర్మానం ఇంకా రాష్ట్రపతి ఆమోద దశలోనే నిలబడిపోయింది. ఇదిలా ఉండగానే ఇటీవల విడుదలపై నీట్ పరీక్షా ఫలితాల్లో తమిళనాడు విద్యార్థులు వెనుకబడిపోయి తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రజలతోపాటూ ప్రతిపక్షాలు సైతం మండిపడగా ఎడపాడి ప్రభుత్వాన్ని కుదిపేసింది. నీట్ మినహాయింపు సాధించడం చేతకాకుంటే తప్పుకోమని నటుడు కమల్‌హాసన్ సైతం సవాల్ విసిరారు. నీట్ పరీక్ష విషయంలో రాష్ట్రంలో ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్నందున వైద్యవిద్య సీట్ల భర్తీపై కౌన్సెలింగ్ జరగలేదు. ఈ పరిణామంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయోమయంలో పడిపోయారు.
ప్రజల ఆక్రందనలపై స్పందించిన సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ నుంచి హామీ పొందినట్లు సమాచారం. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు మినహాయింపు తరహాలో నీట్ కూడా సాధించుకునేందుకు మోదీ సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఒకటి లేదా రెండేళ్లు మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండగా, ఇక జాప్యం లేకుండా గవర్నర్ ఆమోదించి వెంటనే రాష్ట్రపతికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో ఒక అధికారిక ప్రకటన వెలువడగలదని ప్రభుత్వం ధీమాతో ఉంది.
నీట్ మినహాయింపు కేంద్రం పరిశీలనలో ఉందని ఢిల్లీ నుంచి బుధవారం అర్ధరాత్రి 12.45 గంటలకు చెన్నైకి చేరుకున్న సీఎం ఎడపాడి మీడియాతో చెప్పారు.వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. దినకరన్‌కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ ఇద్దర్నీ బయటకు సాగనంపినప్పుడే విలీన చర్చలు అంటూ గతంలో పురట్చి తలైవి శిబిరం సైతం స్పష్టం చేసింది. రెండాకుల చిహ్నానికి లంచం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అనంతరం దినకరన్ పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు వేయడానికి సిద్ధపడ్డా, మంత్రుల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. దీంతో అమ్మ శిబిరంలోనే ఎమ్మెల్యేలు రెండుగా చిలీనట్టుగా పరిస్థితి మారింది. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దినకరన్‌తో టచ్‌లో ఉండటమే కాదు, కొత్త సలహాలు, సూచనలు ఇచ్చే పనిలో పడ్డారని చెప్పవచ్చు.
ఇక, దినకరన్ ప్రధాని నరేంద్ర మోదీతో పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం, అమ్మ శిబిరం సీఎం పళని స్వామి వేర్వేరుగా భేటీ సాగించిన విషయం తెలిసిందే. ఈమేరకు వెలువడ్డ సంకేతాల మేరకు ఆ రెండు శిబిరాల మధ్య రాజీ కుదిరినట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఆ రెండు శిబిరాలు ఏకం అయ్యేందుకు తగ్గ మార్గం సుగమం అవుతున్న సమయంలో దినకరన్ కొత్త అడుగులతో రంగంలోకి దిగబోతుండటం అన్నాడీఎంకేలో చర్చకు దారితీసింది. దినకరన్ ఇంటి వైపుగా పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు కదులుతుండటంతో, వీరి కార్యాచరణ మున్ముందు ఎలా ఉండబోతుందోనన్న ప్రశ్న బయలుదేరింది.
ఇప్పటికే దినకరన్‌కు మద్దతుగా ముఫ్పై ఐదు మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించబోమని, పార్టీ పరంగా దినకరన్ పట్టు సాధించాలన్నదే తమ అభిమతంగా ఆ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తుండాన్ని బట్టి చూస్తే, పళనిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, ఇదివరకు దినకరన్ మంత్రులకు 60 రోజుల గడువు హెచ్చరిక చేసి ఉన్నారు. ఈ గడువు ఆగస్టు ఐదో తేదీన ముగియనుందని, ఆ రోజున దినకరన్ పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టడం ఖాయం అని ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తుండటం ఆలోచించాల్సిందే.