తొలగించాల్సిందే! | AIADMK seeks apology from Stalin for remarks on Jayalalithaa | Sakshi
Sakshi News home page

తొలగించాల్సిందే!

Published Sun, Feb 26 2017 3:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

తొలగించాల్సిందే!

తొలగించాల్సిందే!

► జయ బొమ్మ వివాదం
► దోషి పేరిట పథకాలా?
► స్టాలిన్  ప్రశ్న


కోర్టు తీర్పు  తో దోషిగా ముద్రపడ్డ దివంగత సీఎం జయలలిత ఫొటోల వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో ఆమె ఫొటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగుతుండడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. వాటిని తొలగించాల్సిందేనని పట్టుబడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు వినతి పత్రం సమర్పించారు.

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అమ్మ జయలలిత పేరిట పథకాలు కోకొల్లలు. అమ్మ పథకాలకు ప్రజల్లో విశేష స్పందనే ఉంది. అయితే, ప్రస్తుతం ఆ పథకాలకు పేర్ల మార్పు తప్పనిసరి కానుంది. ఇందుకు కారణం అక్రమాస్తుల కేసులో జయలలిత కూడా ఓ దోషి కావడమే. ఆమె భౌతికంగా లేకున్నా, కోర్టు తీర్పు  లో జయలలితను కూడా దోషిగా పేర్కొన్నారు. దీంతో దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించేందుకు వీలు లేదు. అలాగే, వారి ఫొటోలు కార్యాలయాల్లో ఉండ కూడదు. అయితే, ఇక్కడ అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉండడంతో తాము పెట్టిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పథకాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేర్లు పెట్టేందుకు కసరతు్తలు జరుగుతున్నాయి.

ఇక, అమ్మ జయంతిని అధికారిక వేడుకగా కూడా నిర్వహించారు. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించి ప్రధాన ప్రతి పక్షం ఇక, అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధవైుంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్  శనివారం ఉదయం సచివాలయంకు వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు అన్భళగన్, శేఖర్‌బాబులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో భేటీ అయా్యరు. ఆమెకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో, మంత్రుల ఛాంబర్‌లలో ఉన్న జయలలిత ఫొటోను తొలగించాల్సిందేనని, పథకాల్లో సైతం మార్పులు తప్పనిసరి అని డిమాండ్‌ చేశారు. అనంతరం మీడియాతో స్టాలిన్  మాట్లాడుతూ, జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, అయితే, ఇంకా ఆమె ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్ట విరుద్దం అని అన్నారు. సీఎం నేతృత్వంలో ఆమె జయంతిని అధికారిక వేడుకగా నిర్వహించడం శోచనీయమని విమర్శించారు.

అమ్మ పేరిట ఉన్న పథకాలను కొనసాగిస్తాం, కొత్త పథకాలకు పేర్లు పెడుతామని పాలకులు వ్యాఖ్యానిస్తుండడం బట్టి చూస్తే, చటా్టలను ఏ మేరకు తుంగలో తొకు్కతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించామని, స్పందించని పక్షంలో కోరు్టలో తేల్చుకుంటామన్నారు. దోషిగా ముద్ర పడ్డ వారి ఫొటోలను ఇంకా తొలగించకుండా ఉండడం చట్ట విరుద్ధం అని తమిళనాడు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇలంగోవన్  మండిపడ్డారు. కోర్టు తీరు్పను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్న తమిళనాడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక, పనిగట్టుకుని తమ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే చేస్తున్న కుట్రల్లో భాగంగానే, ప్రస్తుతం అమ్మ ఫొటోల వివాదాన్ని సృష్టిస్తున్నారని, అన్నాడీఎంకే ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్, మంత్రులు తంగమణి, దిండుగల్‌ శ్రీనివాసన్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement