తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే.