Rammohana Rao
-
మాజీ సీఎస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్
-
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.రామ్మోహన్రావు అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్మోహన్‌రావుకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని సమాచారం. కాగా ఇటీవల ఐటీ అధికారుల జరిపిన దాడుల్లో ఆయన అవినీతి బండారం బటయపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. మాజీ సీఎం జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన కుమారుడు వివేక్ రావు, మరికొందరి ఇళ్ల నుంచి మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన రామ్మోహన్ రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. -
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్
-
సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
-
సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అందులోనే సీఎస్‌ను తప్పించాలని గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్. -
తెలుగు విద్యార్థుల నరకయాతన
ఇంకా తేరుకోని శ్రీనగర్ ► జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధం.. ► సురక్షితంగా 45 మంది విద్యార్థుల ఢిల్లీకి తరలింపు ►11 మంది హైదరాబాద్‌కు న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారిలో 47 మంది తెలుగువారిని గురువారం సురక్షితంగా ఢిల్లీలోని ఏపీభవన్‌కు తరలించారు. వీరిలో 45 మంది శ్రీనగర్‌లోని నిట్స్ విద్యార్థులతో పాటు అక్కడే ముత్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నాయుడు దంపతులున్నారు. బాధితులకు ఏపీభవన్‌లో భోజన వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6, 8, 9 గంటలకు మూడు విమానాల్లో బాధితులను ఏపీ, తెలంగాణకు పంపారు. తొలుత లడఖ్ నుంచి ఢిల్లీకి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న బాధిత విద్యార్థుల యోగక్షేమాలను ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారందరినీ సురక్షితంగా తరలిస్తామన్నారు. సురక్షితంగా సొంత రాష్ట్రాలకు.. తొలి బ్యాచ్‌లో ఏపీభవన్‌కు చేరుకున్న విద్యార్ధుల్లో.. కె.నరేశ్ (శ్రీకాకుళం), ఎ.శ్యామ్‌కుమార్ (వైజాగ్), నానావతి కుమార్ (నల్లగొండ), బోదల రాజశేఖర్ (విజయనగరం), ఎన్.సృజన్‌కుమార్ (వరంగల్), బి.రాజ్‌కుమార్ (ఆదిలాబాద్), కె.శివకుమార్ (వరంగల్), రాహుల్ (కర్నులు), గూడ రాహుల్ (కరీంనగర్), జె.సాయిచరణ్ (నిర్మల్), బూర్గుల శ్యామ్ (వరంగల్), బీవీఆర్ రోహిత్ (వైజాగ్), మనోజ్‌కుమార్ రెడ్డి (కడప), వనం ప్రేమ్ ప్రసన్న (సికింద్రాబాద్), కొండపల్లి గిరీశ్ (భీమవరం), యు.అఖిల్ సాగర్ (ఆదిలాబాద్), వొట్టి శ్యామ్ సాయి (వైజాగ్), టి.సాయివెంకట నాగ (విజయవాడ), ఎన్.హరికృష్ణ (పశ్చిమగోదావరి), పి.తేజ (రాజమండ్రి), జైకిషన్ శర్మ (విశాఖపట్నం), యైఅన్వేష్ సాయి (విశాఖపట్నం), వంగర వంశీకృష్ణ (వరంగల్), కె.వెంకటసాయి ప్రకాశ్ (పశ్చిమ గోదావరి), చౌహాన్ మానిక్‌రావు (ఆదిలాబాద్), కోరుకొండ కేశవరావు (విశాఖపట్నం), కె.మూర్తి శ్రీచరణ్ (పశ్చిమ గోదావరి), జి.విపిన్కర్ (హైదరాబాదు), బి.దేవంత్ (విజయవాడ), ఎస్.ఆనంద్జీ( పశ్చిమ గోదావరి), బి.శ్రవణ్‌కుమార్ (ఖమ్మం), ఎన్.అమర్నాథ్ రెడ్డి (విశాఖపట్నం), బి.వంశీ (నల్లగొండ), ఎ.మంజేశ్ కుమార్ (ఆదిలాబాద్), బి.విష్ణు వర్మ (వరంగల్)తో పాటు నాయుడు దంపతులు ఉన్నారు. రెండో బ్యాచ్‌లో లేహ్ నుంచి అనిల్‌రెడ్డి, కె.లిఖిత్ రెడ్డి, పి.ప్రశాంత్‌కుమార్, ఎం.నాగార్జున, పి.దినేశ్, కాళీబాబు, ఎస్.మురళీ మనోహర్, అఖిల్ ఉన్నారు. వీరిలో 11 మంది గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.. జమ్ముకాశ్మీర్‌లో తెలుగు విద్యార్ధులు నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందలేదని మండిపడ్డారు. ‘‘ శ్రీనగర్‌లోని నిట్స్‌లో 74 మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారు. నిట్స్ హాస్టల్ల మొదటి అంతస్థులోకి ఆదివారం ఉదయం వరద నీరు చేరింది. మమ్మల్ని సోమవారం ఉదయం దగ్గర్లోని ఎత్తై ప్రదేశంలో ఉన్న కాశ్మీరు యూనివర్శిటీ క్యాంపస్‌కు తరలించారు. తినడానికి ఒక పూట బిస్కట్లు తప్ప మరేమీ దొరకలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. మా హాస్టల్ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు 18 కిలోమీటర్లు. బోటు ద్వారా ప్రయాణం చేయాలంటే.. ఒక్కొక్కరి నుంచి రూ.5,000 డిమాండ్ చేశాడు. దీంతో బోటును వదిలి.. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మీదుగా లడఖ్‌కు క్యాబ్‌లో వెళ్లాం. లడఖ్ నుంచి ఢిల్లీకి విమానచార్జీలు అప్పటి వరకు ఐదారు వేలు ఉండగా.. రూ.20 నుంచి 22 వేలకు పెంచేశారు. సహచర విద్యార్ధి రోహిత్.. వాళ్ల నాన్న (లాయర్)కు ఫోను చేసి విషయాన్ని చెప్పాడు. ఆయన ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఢిల్లీకి విమానం ఏర్పాటు చేశారు. రోహిత్ లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో..’’అంటూ బాధిత విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వరద బాధితులకు ప్రధాని కార్యాలయ సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని గురువారం విరాళంగా ప్రకటించారు. శ్రీనగర్: వరద బీభత్సం నుంచి జమ్మూకాశ్మీర్ ఇప్పట్లో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరద సహాయ కార్యక్రమాలు ప్రారంభమై 10 రోజులైనా.. గురువారం నాటికి శ్రీనగర్‌లోనే ఇంకా 4 లక్షలకు పైగా ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు. అయితే, జీలం నది, దాని ఉపనదుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో సహాయ చర్యలకు మరింత అవకాశం లభిస్తోంది. మరోవైపు దాల్ సరస్సు నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూ, కాశ్మీర్లలోని వరద పీడిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 లక్షల మందిని సహాయ దళాలు రక్షించగలిగాయి. త్రివిధదళాలు, ఎన్డీఆర్ఎఫ్, అధికారులు కలసికట్టుగా సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. నా ప్రభుత్వాన్నీ ముంచేశాయి: ఒమర్ భీకర వరదల్లో తన ప్రభుత్వం కూడా మునిగిపోయిందని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లలో కనీవినీ ఎరగనటువంటి ఈ వరదలు తన రాజధానిని తీసుకెళ్లిపోయాయన్నారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు, పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆసుపత్రులు.. అన్నీ నీటమునిగాయని చెప్పారు. కాగా, గురువారం సైన్యం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో ఒమర్ సైతం పాలుపంచుకున్నారు. -
బాబు డబుల్ గేమ్ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజనుడు నిమ్మక జయరాజ్‌పై చంద్రబాబు చిన్న చూపు చూశారా? ఆయనేం చేయలేరనే సస్పెండ్ చేశారా? తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కెంబూరి రామ్మోహనరావును చూసి భయపడ్డారా? ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గం తిరగబడుతుందని భయాందోళన చెందారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ రెబల్స్‌గా నామినేషన్ వేసిన వారిపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించారు. కాకపోతే, ఇందులో వివక్ష చూపించారు. జిల్లాలో ఇక్కడ ఇద్దరు రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఒకరు నిమ్మక జయరాజ్, మరొకరు కెంబూరి రామ్మోహనరావు. అయితే, వీరిలో జయరాజ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కెంబూరి రామ్మోహనరావుపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో టీడీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గిరిజనుడని జయరాజ్‌పై చర్యలు తీసుకున్నారని, బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కెంబూరి రామ్మోహనరావుపై చర్యలు తీసుకోలేదన్న వాదన విన్పిస్తోంది. నిజమైన గిరిజనులకు చంద్రబాబు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు మొండి చేయి చూపారు. ఐదేళ్లుగా సాలూరు ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశలు పెట్టుకుని పనిచేసిన గుమ్మడి సంధ్యారాణిని కాదని, కుల వివాదంతో ఇబ్బందిపడ్డ ఆర్.పి.భంజ్‌దేవ్‌ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చి టిక్కెట్ ఇచ్చారు. దీంతో అయిష్టంగా సంధ్యారాణి అరకు పార్లమెంట్‌కు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఉన్న మరో ఎస్టీ రిజర్వు స్థానమైన కురుపాంలో పదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న గిరిజన నేత నిమ్మక జయరాజ్‌కు చంద్రబాబు అన్యాయం చేశారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు టిక్కెట్ ఇచ్చారు. థాట్రాజ్‌కు కులవివాదం ఉన్నా అవేవి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇక, చీపురుపల్లిలో స్థానికం గా ఉన్న వారిని కాదని, తనకు ప్రత్యర్థిగా ఉన్న కిమిడి మృణాళినికి టిక్కెట్ ఇచ్చారన్న ఆగ్రహంతో కెంబూరి రామ్మోహనరావు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. అయితే, వీరిద్దరిని బుజ్జగించేం దుకు జిల్లా నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్సీ ఇతరత్రా పదవులు ఇస్తామని ప్రలోభాలు పెట్టింది. చంద్రబాబునాయుడు సైతం నేరుగా మాట్లాడారు. అనేక ఆశలు చూపిం చారు. అసలు అధికారంలోకి వచ్చేదెక్కడ? అదే లేనప్పుడు పదవులెక్కడొస్తాయి? ఎందుకొచ్చిన మోసపూరిత హామీలు అని రెబల్ అభ్యర్థులు తిరస్కరించారు. రాజీకీ రాకపోవడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా తలొగ్గలేదు. ఒకరిపైనే వేటు.. ఎంతకీ దారికి రాకపోవడంతో టీడీపీ అధినేత రెబల్స్‌పై చర్యలకు ఉపక్రమించారు. కాకపోతే, చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపారు. ఎటువంటి ఒత్తిడి ఉండదని, ప్రభావం చూపలేరన్న ఉద్దేశంతో గిరిజనుడైన నిమ్మక జయరాజ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, చీపురుపల్లిలో రెబల్‌గా బరిలో ఉన్న కెంబూరి రామ్మోహనరావుపై చర్యలు తీసుకోలేదు. దీనికంతటికీ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే కారణమని తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గం తిరగబడుతుందన్న భయంతో వెనుకడుగువేసినట్టు తెలుస్తోంది. మండిపడుతున్న గిరిజన వర్గాలు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై గిరిజన వర్గాలు మండిపడుతున్నాయి. మొన్న డీవీజీ శంకరరావు, నేడు నిమ్మక జయరాజ్‌కు అన్యాయం చేసి పలు అభియోగాలు, ఆరోపణలు ఉన్న నేతలకు టిక్కెట్లు ఇచ్చి మోసగించారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశాయి. ఈమేరకు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. -
పార్టీని వీడొద్దు : కృపారాణి
కంచిలి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీని వీడి బయటకెళ్లవద్దని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో మంగళవారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. స్వలాభానికి, రాజకీయ లబ్ధికోసం పార్టీ మారుతున్నవారి నైజాన్ని గుర్తించాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కొందరు వ్యక్తులు బయటికెళ్ళి పోయినంతమాత్రాన పార్టీకి ఏం నష్టం జరిగిపోదని, కార్యకర్తలంతా పార్టీలోనే ఉంటున్నారని సమావేశానికి హాజరైనవారినిచూస్తే అర్థమవుతుందన్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టమైందన్నారు. మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ఇచ్ఛాపురం నియోజవర్గ కార్యకర్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ పార్టీని అధికారంలోకి తెస్తారన్నారు. సోంపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్. దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించేవారు ముందు పార్టీకి, పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ డాక్టర్స్‌సెల్ ప్రతినిధి కిల్లి రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా(లల్లూ), మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లాభాల స్వర్ణమణి, పిలక పద్మావతి, శ్యామ్‌పురియా, పి.వి. రమణ, పి. చిన్నబాబు, పి. నీలాచలం, పి.దేవ్, బి. శోభన్‌బాబు, డి. ధర్మారావు, బి. మోహన్‌దాస్, రెడ్డి రాజశేఖర్, బి. శ్యామ్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.