మహాసమాధిని దర్శించుకున్న పూనం మాలకొండయ్య
పుట్టపర్తి టౌన్ :
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శనివారం ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గాన ప్రశాంతి నిలయం చేరుకున్న ఆమెకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ప్రసాద్‌రావు, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి, తహసీల్దార్ సత్యనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు.
శాంతిభవన్ అథితి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్యసేవలను పరిశీలించనున్నారు.