కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్ బందోపాధ్యాయను బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారం ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు.
కాగా, ఇటీవల యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా.. సీఎస్తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్ ఆలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆయనను వెనక్కి పంపించేది లేదని మమతా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన పంతం నెగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment