సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి | Bihar Chief Secretary Died With Covid Positive | Sakshi
Sakshi News home page

సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి

Apr 30 2021 4:42 PM | Updated on Apr 30 2021 4:43 PM

Bihar Chief Secretary Died With Covid Positive - Sakshi

ప్రభుత్వ పాలనాధిపతి.. ముఖ్యమంత్రి వెంట నిత్యం ఉండే వ్యక్తి కరోనా బలి తీసుకుంది. ఆయన మృతితో సీఎం దిగ్ర్భాంతి

పాట్నా: బిహార్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండగా భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కరోనా బారిన పడి చనిపోవడం కలకలం రేపుతోంది. నిత్యం ముఖ్యమంత్రి వెంట ఉండే వ్యక్తి.. ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండే కీలక పాలనాధికారి మృతి చెందడంతో బిహార్‌లో ఆందోళన రేకెత్తుతోంది. 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అరుణ్‌కుమార్‌ సింగ్‌.

బిహార్‌లో ఎన్నికలు ముగిసిన అనంతరం మరొకసారి నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అరుణ్‌కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఫిబ్రవరిలో ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అరుణ్‌కుమార్‌ సింగ్‌ మృతిపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తి అని, పలు హోదాల్లో పని చేశారని.. ఆయన మరణం పరిపాలన రంగానికి తీరని లోటు అంటూ నితీశ్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి
చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement