పట్నా : కరోనా వైరస్ బారినపడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. సోమవారం నితీశ్‌కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా వైరస్ సోకినవారి వైద్య ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చికిత్స సహాయత కోష్ యోజన కింద కరోనా బాధితులకు చికిత్స అయ్యే ఖర్చులు భరిస్తామని చెప్పారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందకు ఇండియా-నేపాల్ సరిహద్దుల్లోని 49 ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు నితీశ్ తెలిపారు. కరోనాను ఎదుర్కొవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కరోనా నివారణ చర్యల్లో భాగంగా బిహార్ అసెంబ్లీని స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. మరోవైపు భారత్‌లో ఇప్పటివరకు 110 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment