
పాట్నా: ప్రతిపక్షాల డిమాండ్‌తో, కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఎట్టకేలకు కరోనా లెక్కల్ని సవరించి అధికారికంగా ప్రకటించింది. బీహార్‌లో కొవిడ్-19తో ఇప్పటిదాకా 9 వేలమందికి పైగా చనిపోయారని తేల్చింది. ఇది గతంలో ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఇంతకు ముందు బీహార్ ఆరోగ్య శాఖ మరణాల లెక్కను 5, 500గా చూపించింది. ఈ తరుణంలో కోర్టు జోక్యంతో తాజా సంఖ్యను 9,429గా తేల్చింది.
ఇక మార్చ్ 2020 నుంచి మార్చ్ 2021 మధ్య కొవిడ్ మరణాలు 1,600 కాగా, కేవలం ఏప్రిల్ నుంచి జూన్ 7వ తేదీ మధ్య 7,775 మరణాలు సంభివించాయని బీహార్ ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. అంటే ఈ రెండు నెలల్లోనే అంతకు ముందుకంటే ఆరు రెట్ల మరణాలు నమోదు అయ్యాయన్నమాట. మొత్తం జిల్లాలను పరిశీలించాక 72 శాతం పెరగుదలతో ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
38 జిల్లాలకుగానూ రాజధాని పాట్నాలో 2,303 మంది చనిపోగా, రివైజ్ లెక్కల్లో ఇక్కడే ఎక్కువ మరణాలు నమోదు అయినట్లు చూపించారు. సీఎం నితీశ్ స్వంత జిల్లా నలందలో 222 మరణాలు నమోదు అయ్యాయి. ఒక ప్రాంతం వాళ్లు మరో ప్రాంతంలో కరోనా ట్రీట్మెంట్తో చనిపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ్ అమ్రిత్ వెల్లడించాడు. కరోనా మరణాల సంగతి ఎలా ఉన్నా.. తాజా లెక్కలతో మిగతా వాటిల్లో కూడా భారీ మార్పులు చూపించింది ప్రభుత్వం. ఇక రికవరీ రేటును కూడా 98 నుంచి 97 శాతానికి తగ్గించడం విశేషం. ఇదిలా ఉంటే అధికారిక లెక్కల్లో కొవిడ్ అంత్యక్రియల సంఖ్య 3,243గా ఉండడం కొసమెరుపు. అయితే బీహార్ మాత్రమే కాదని.. దేశం మొత్తం ఇలాంటి లెక్కల గందరగోళం అంతటా ఉందని పలువురు ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
చదవండి: ప్రజల సొమ్మే కదా.. నొక్కేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment