కేరళ: కేరళలోని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ(సీఎస్) తన ఫేస్బుక్ లో అబ్దుల్ కలాంపై చేసిన పోస్టింగ్ను కేరళ ప్రభుత్వం బుధవారం తీవ్రంగా ఖండించింది. అబ్దుల్ కలాం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కలాం మృతికి నివాళిగా వచ్చే ఆదివారం కేరళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయాలంటూ ఫేస్బుక్లో చీఫ్ సెక్రటరీ థామ్సన్ పోస్టింగ్ చేయడంపై సీఎం కార్యాలయం మండిపడింది. ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని సీఎం కార్యాలయం అధికారకంగా నిర్ణయించలేదని పేర్కొంది. ఫేస్బుక్లో ఆ పోస్టింగ్ ను వెనక్కి తీసుకోవాలని థామ్సన్ కు ప్రభుత్వం సూచించింది.