కర్నాటక చీఫ్ సెక్రటరీగా శాలినీ రజనీష్
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్‌డీ చేశారు. మేనేజ్‌మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్‌లుగా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment