
మెట్రో ప్రాజెక్టుపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం టాస్క్ ఫోర్స్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రోరైలు నిర్మాణానికి అవసరమైన ఆస్తులను మార్చిలోపు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 219 ప్రైవేటు, 85 ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు. మెట్రోరైలు భద్రత కోసం ప్రత్యేక భద్రతా దళాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని రాజీవ్ శర్మ సూచించారు. నాగోలు, మెట్టుగూడ ప్రాంతాల్లో మెట్రోరైలు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.