చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో మెట్రో రైల్ అలైన్‌మెంట్ మార్పుపై వెనక్కి తగ్గేదిలేదని సర్కారు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అలైన్‌మెంట్ మార్పుపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో మెట్రో రైల్ అలైన్‌మెంట్ మార్పుపై వెనక్కి తగ్గేదిలేదని సర్కారు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ (మెట్రో) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విషయంలో రాజీలేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహీమార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం నిర్మిస్తే అత్యధిక వ్యయంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం కొన్నేళ్లపాటు ఆలస్యమవుతుందని అధికారులు సీఎస్ శర్మకు వివరించినట్లు తెలిసింది. చారిత్రక ప్రదేశాలున్న మార్గాల్లో భూగర్భ మెట్రో లేదా అలైన్‌మెంట్ మార్పు అంశంపై నిపుణుల ఆధ్వర్యంలో విస్తృత పరిశీలన జరిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నివేదికను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నారు