గోదావరి పుష్కరాలు జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో తీరం వెంట హారతి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆ జిల్లాల కలెక్టర్లు శుక్రవారం తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై జిల్లా అధికారులు, కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో శుక్రవారం రివ్యూ సమావేశం ఏర్పాటుచేశారు.
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ ఎన్పవర్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. పుష్కరాల ప్రారంభం నాటికి రెండు గోదావరి జిల్లాల్లో తీరంలో ఉన్న గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పారు.