
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కేబినెట్ భేటీకి సంబంధించి నోట్ తనకు వచ్చిందని ఆయన తెలిపారు. కేబినెట్ భేటీలో ఏయే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలని సీఎంను కోరినట్టు ఆయన తెలిపారు.
ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాల్సిందిగా ఆయన సెక్రటరీకి సూచించినట్టు వెల్లడించారు. కేబినెట్ అజెండాను పరిశీలించి.. ఎన్నికల సంఘానికి పంపుతామని, ఆ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం కోరుతోందని, ఈ విషయంలో సీఎం అభిప్రాయం తీసుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment