సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకముందే చంద్రబాబు ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తెచ్చారు. మరోవైపు.. పోలవరంపై కూడా చంద్రగ్రహణం పట్టుకుంది. బాబు పాలనలో పోలవరంపై మరో కుట్ర జరిగింది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది. కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్‌లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ప్రాజెక్ట్ ఎత్తు కుదింపుతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు కుదించడంతో 115.4 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నేడు అప్పులు తేచ్చే ప్రక్రియలో బిజీ అయిపోయారు. తాజాగా చంద్రబాబు.. మరో మూడు వేల కోట్ల అప్పు తెచ్చారు. నిన్న 7.17 శాతం వడ్డీకి మూడు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా కూటమి ప్రభుత్వం రుణం సమీకరించింది. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే 59వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. మరోవైపు.. కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు అప్పులు తీసుకుంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment