lv subramanyam
-
ఎల్వీ వ్యాఖ్యలు అర్థరహితం
తిరుపతి మంగళం: టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో మూడేళ్లు ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీకి వ్యతిరేకంగా మాట్లాడడం దారుణమని టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి విషయాన్ని రాజకీయం చేసి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా అనంతరం భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోందని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకమండలి, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రెండోరోజు దర్శన టోకెన్లు జారీచేయకపోవడంతో భక్తుల సంఖ్య పెరిగి కొంతసేపు తోపులాట జరిగిందన్నారు. అంతేతప్ప భక్తుల పట్ల ఎవరూ అశ్రద్ధగా లేరని చెప్పారు. ఎల్వీ సుబ్రమణ్యం కేవలం చంద్రబాబుకు తొత్తుగా టీటీడీని రాజకీయం చేస్తున్నట్లు ఉందే తప్ప టీటీడీ మాజీ ఈవోగా మాట్లాడలేదని మండిపడ్డారు. టీటీడీ పాలకమండలి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోందన్నారు. టీటీడీ పాలకమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోకుండా మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మాజీ ఈవోగా టీటీడీకి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వామి ప్రతిష్టను దిగజార్చి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. టీటీడీ విధివిధానాలపై అపార అనుభవం ఉన్న వ్యక్తి ధర్మారెడ్డి అని చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలనే ఆలోచనతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు ఎం.వి.ఎస్.మణి, బండ్ల లక్ష్మీపతిరాయల్ పాల్గొన్నారు. -
కాకినాడలొ చాగంటి దేశభక్తి కార్యక్రమం
-
డిసెంబర్ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద మంజూరైన గృహాల్లో నిర్మాణంలో ఉన్న వాటిలో 70 వేల గృహాల నిర్మాణం డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ పరిపాలన, ఏపీటిడ్కో అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో పీఎంఏవై పథకంపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా నిధులతో తక్కువ పెట్టుబడితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆ ఇళ్లకు అవసరమైన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటర్నల్ రహదారుల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు మాట్లాడుతూ.. పట్టణాల్లో పీఎంఏవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 లక్షల గృహాలను కేటాయించగా, 3.93 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైందని, డిసెంబరులోగా 70 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం సంబంధిత అధికారులతో సమీక్షించారు. తొలి విడతలో 60,693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలను ఎప్పటిలోగా అమలు చేసేది స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పట్టణంలో ప్లాస్టిక్ పొట్లాల్లో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి దానిని పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎస్
-
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: 19 మంది అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా అజయ్ జైన్ కొనసాగుతారు. ఇప్పటి వరకూ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన అనంతరామును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు(ఐఆర్ఏఎస్) చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న కాంతిలాల్ దండే (ఫుడ్ ప్రాసెసింగ్, చక్కెర) పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఎవరినీ నియమించకుండా తాత్కాలికంగా అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. -
విభజన నష్టాల భర్తీకి మీ సాయం అవసరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నామని, విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నీతి ఆయోగ్ సహకారం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విభజన కారణంగా అభివృద్ధికి ఏపీ దూరమైందన్నారు. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ రంగాలే అభివృద్ధికి చోదకాలని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం, కడప ఎదుగుతున్న జిల్లాలుగా ఉన్నాయని వీటితోపాటు శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇందుకు 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సాయం చేయాలని కోరారు. సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని మోడల్ స్టేట్‌గా తయారు చేయాలని సీఎం గట్టి సంకల్పంతో ఉన్నారని సీఎస్ తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోందని, రాష్ట్రానికి తగిన రీతిలో సాయమందిస్తే లక్ష్య సాధనలో తాము కూడా పాలుపంచుకుంటామన్నారు. దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని నిర్దేశించుకున్నందున రాష్ట్రానికి తగినంత తోడ్పాటునందించాలని కోరారు. మంచి వనరులు, నైపుణ్యం, అంకితభావం కలిగిన అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం తమకు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు తీసుకుందని, బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నామని సీఎస్ వివరించారు. విభజన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పారదర్శకత విధానా లను తెచ్చామని, గత అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశామని, ఇందులో భాగంగా మొదటిసారిగా జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని తెచ్చామని సీఎస్ వివరించారు. వైజాగ్– చెన్నై, చెన్నై – బెంగళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కాలుష్య నివారణకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని, ఇందుకు నీతి ఆయోగ్ సహకరించాలని కోరారు. -
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, అమరావతి : టూరిజం, యూత్అ ఫైర్స్ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే దానిపై సీఎస్‌తో సమీక్షించామని తెలిపారు. 2019 ఏడాదికి గాను మంగళంపల్లి బాల మురళీ కృష్ణ అవార్డును కర్నాటక సంగీత విధ్వాంసురాలు బాంబే జయశ్రీకి అందజేయనున్నట్టు వెల్లడించారు. బహుమతి ప్రదాన కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తామని అన్నారు. రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త శిల్పారామాలకు పీపీపీ పద్ధతిలో భూమిని కేటాయిస్తామని స్పష్టం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. నెలరోజుల్లో విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సాత్విక్ సాయిరాంను అభినందిస్తాం.. ‘బ్యాడ్మింటన్‌లో పతకం సాధించిన అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాంను ముఖ్యమంత్రి సమక్షంలో అభినందిస్తాం. ఇటీవల చనిపోయిన బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. విశ్వ విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు, ట్రాక్స్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తాం. ప్రతి నెల ఒక జిల్లాలో క్రీడలు నిర్వహిస్తాం. ఆయా క్రీడల్లో గెలుపొందిన వారితో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. గాయాల పాలైన, అనారోగ్యానికి గురైన క్రీడాకారులకు చికిత్స చేయిస్తాం. దానికోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో టూరిస్టుల కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉన్నాం. తద్వారా అన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల సంప్రదాయం వెల్లి విరేసేలా కృషి చేస్తాం. పురాతన దేవాలయాలను దేవాదాయ లేక టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేస్తాం’అని అవంతి చెప్పారు. -
ప్లాస్టిక్ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!
సాక్షి, విజయవాడ : జిల్లా యంత్రాంగం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృష్ణలంకలోని గీతానగర్‌లో అధికారులు మొక్కలు నాటి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘మన విజయవాడ అనే నినాదంతో ప్లాస్టిక్‌ను తరిమేయాలన్నదే లక్ష్యం. భూసారం తగ్గిపోవడానికి, డ్రైనేజీ సమస్యలకి, పర్యావరణం దెబ్బతినడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. విజయవాడలో అందరూ చైతన్య వంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవు. ఆ విషయాన్ని ఫొటో తీసి పంపితే వంద రూపాయలు పారితోషికం ఇస్తా’అన్నారు. నగరంలో ఎవరైనా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ అమ్మినా, వాడినా జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్‌పై పూర్తి నిషేదం అమలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పాత ప్రీమియంతోనే వైఎస్సార్ బీమా
సాక్షి, అమరావతి : వైఎస్సార్ బీమా ప్రీమియం పెంచబోమని, పాత ప్రీమియమే వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రీమియం పెంచవద్దంటూ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ఆదేశిస్తామని భారత ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా డిజిగ్నేట్ అయిన రాజీవ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఢిల్లీలో కలిసి వైఎస్సార్ బీమా ప్రీమియం పెంచుతూ ఎల్ఐసీ తీసుకున్న నిర్ణయంవల్ల ఏపీపై చాలా అదనపు భారం పడుతుందని వివరించారు. ‘2.60 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా అమలుచేస్తోంది. కుటుంబ యజమానులైన/పోషకులైన అసంఘటిత రంగ కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, వృద్ధాప్యం రాకముందే సహజ మరణం చెందినా ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమాను అమలుచేస్తోంది. బీమా పరిధిలోని కార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా కింద రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. 18 నుంచి 50 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.30 వేలు ఈ బీమా కింద ఇస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి బీమా ప్రీమియం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బీమా ప్రీమియం పెంచుతున్నట్లు ఎల్ఐసీ హఠాత్తుగా ప్రకటించింది. దీనివల్ల కలిగే ఆర్థిక భారాన్ని వివరిస్తూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఎల్ఐసీని ఒప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేను ఆర్థికశాఖ అధికారులను కలిసి ఈ భారం మోపవద్దని కోరాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రధానికి లేఖ రాశారు. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అలాగే, నేను రాజీవ్‌కుమార్‌ను గురువారం కలిసి పాత ప్రీమియమే అమలుచేసేలా ఎల్ఐసీని ఆదేశించాలని కోరా. వెంటనే ఆయన అలాగే చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రీమియం పెంచాల్సి వస్తే కమిటీ వేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెంచుతాం. ప్రస్తుతానికి ఏపీకి ఈ పెంపుదల ఉండదని రమేష్‌కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారు’.. అని ఎల్వీ సుబ్రహ్మణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఊరట కలిగించే అంశమని ఆయన చెప్పారు. రెవెన్యూ లోటు విడుదలపైనా సానుకూలత అలాగే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం ప్రభుత్వం భర్తీ చేయాల్సిన రూ.16,000వేల కోట్ల రెవెన్యూ లోటును కూడా తక్షణమే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సీఎస్ ఎల్వీ విజ్ఞప్తి చేశారు. ఇందుకు రమేష్‌కుమార్ స్పందిస్తూ.. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని, సాధ్యమైనంత త్వరగా ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
నూతన గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందర్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్ నివాసానికెళ్లిన ఆయన గవర్నర్‌గా నియమితులైనందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు షురూ.. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందర్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద ఏర్పాట్లును ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్పీ సిసోడియా, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా శనివారం రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. పనులు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించి.. వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు వస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. 24వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. -
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ సమీక్ష
సాక్షి, అమరావతి : ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా తదితర విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్ చర్చించారు. ఈ నెల 12న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
అవినీతి నిగ్గు తేల్చండి
వ్యవస్థను బాగు చెయ్యాలన్న నా ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలి. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెబుతున్నా. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి సాగించిన దోపిడీని బట్టబయలు చేయాలని సంకల్పించింది. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేస్తుందని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ విభాగాల్లోని సీనియర్ అధికారుల బృందం విచారణకు సహకారం అందజేస్తుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత టీడీపీ సర్కారు పాల్పడిన అక్రమాలపై సమగ్రంగా విచారణ చేసి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఐదుగురు సభ్యుల మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. భారీఎత్తున దోచేసిన తీరును ప్రజల ముందు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి పారదర్శక పరిపాలన అందించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిని వెలికి తీయడం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు ఉప సంఘం వేయాల్సి వచ్చిందంటే..: అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విభజన గాయాలతో ఛిద్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. జూన్ 2, 2014 నుంచి మే 29, 2019 వరకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. అక్రమార్జన కోసం అనుకూలమైన విధానాలను రూపొందించింది. వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక నుంచి గనుల వరకూ సహజ సంపదను కొల్లగొట్టింది. టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పేదల భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ, దేవదాయ భూములను హస్తగతం చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. టీడీపీ నేతల దోపిడీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమించింది. టీడీపీ సర్కారు అసంబద్ధ విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల చిన్న, మధ్య తరగతి రైతులు భూములు కోల్పోయారు. భూ కబ్జాల వల్ల ప్రజలు వారి సొంత ఇళ్లను, గ్రామాలను కోల్పోయి నిర్వాసితులగా మారారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేసి దోపిడీ చేయడం వల్ల రాష్ట్రంలో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలిగింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఈ దోపిడీ సాగింది. ఈ నేపథ్యంలో చెడిపోయిన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అవినీతి రహిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అవినీతికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులతో పాటు సంస్థలను గుర్తించి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న దురుద్దేశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను చేస్తుంది. మంత్రివర్గ ఉప సంఘం స్వరూపం.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ఈ ఉప సంఘం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు - గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన భారీ నిర్ణయాలు, కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడంపై విచారణ. - రాష్ట్రంలో టెండర్ల విధానం, ఆ విధానంలో టీడీపీ సర్కారు చేసిన సవరణలు, కాంట్రాక్టర్లకు అప్పగించిన భారీ ప్రాజెక్టుల పనులు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు, స్విస్ ఛాలెంజ్ విధానం, సహజ వనరుల కేటాయింపు (ప్రధానంగా భూములు, నీళ్లు, గనులు, విద్యుత్)లో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దోచుకున్న తీరుపై సమీక్ష. - బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రజాభ్యుదయం ముసుగులో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ సంస్థలపై చూపిన దుష్ప్రభావంపై సమీక్ష - గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్స్, లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ), స్పెషల్ పర్పస్ వెహికల్స్, జాయింట్ వెంచర్స్‌లో అవినీతికి పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం చూపడంపై విచారణ. - వివిధ కార్పొరేషన్లు, పరిశ్రమలు, అథారిటీలు, సొసైటీల పనీతీరుపై సమీక్ష. వాటిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలి. - గత ప్రభుత్వం భారీఎత్తున కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడంపై సమగ్రంగా విచారణ. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తీరుపై సమీక్ష - ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ. భూముల కేటాయింపులో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వ్యవహారాలపై ప్రత్యేకంగా సమీక్ష - గత ప్రభుత్వం మైనింగ్ లీజులు మంజూరు చేయడంపై సమగ్ర విచారణ. అక్రమంగా మైనింగ్ లీజులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చేకూరిన నష్టంపై నివేదిక. - విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమాలకు పాల్పడి కమీషన్లు తీసుకోవడంపై విచారణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన తీరుపైన దర్యాప్తు. - వైద్య, విద్య, పౌష్టికాహార కార్యక్రమాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ. - ఐటీ రంగంపై సమగ్రంగా సమీక్ష. - సీఆర్డీఏ, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పెద్దలు పాల్పడిన అక్రమాలపై సమగ్ర సమీక్ష. సీఆర్డీఏ పరిధిలో భూముల కేటాయింపు, ఇన్సైడర్ ట్రేడింగ్ విధానంలో భూముల కొనుగోలు ద్వారా అక్రమంగా లబ్దిపొందడంపై విచారణ. - ఈ అక్రమాల్లో రాజకీయ నేతలు, కీలక అధికారుల పాత్రపై విచారణ. -
గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నెల్లూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొత్తం 1,70,543 గ్రామ వలంటీర్ల నియామకానికి కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సూచించారు. ఈ వెబ్‌పోర్టల్‌ను కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే (ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయానికే) 1,47,376 మంది సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణాల్లో 40 వేల వార్డు వలంటీర్ల నియామకాలకు సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మంగళవారం జిల్లాల వారీగా వీటి నియామకానికి సంబంధించిన ప్రకటనలు రెండు దినపత్రికల్లో ప్రచురితం కానున్నాయి. -
గ్రామ-వార్డు వలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్
సాక్షి, అమరావతి: గ్రామ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం http://gramavolunteer. ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. గ్రామ వలంటీర్ల నియామకాల విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా 2 తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసి.. ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏస్థాయిలోనూ అవినీతికి తావులేకుండా చేసే ఉద్దేశంతో పాటు కులమత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా అర్హులందరికీ పథకాలు చేరవేయడం కోసమే ప్రభుత్వం గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు వలంటీర్ల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో నంబరు 104లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా గ్రామ వలంటీర్లను ఏ జిల్లాలో ఎంత మందిని నియమించాలన్నది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరీలలో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. స్థానికతే ప్రధాన అర్హత... గ్రామ స్థానికతే వలంటీర్లుగా నియామకానికి ప్రాథమిక అర్హతగా ఉత్తర్వులో స్పష్టం చేశారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు దరఖాస్తుకు కనీసం పదో తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులకు జూలై 11 నుంచి 25 తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వేతనాలకు ఏటా రూ.1,200 కోట్లు మంజూరు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లుగా నియమితులయ్యే వారికి నెలకు రూ. 5 వేల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఏటా రూ.1,200 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతున్నట్టు సీఎస్ ఉత్తర్వులో తెలిపారు. ఆగస్టు ఒకటి నాటికి రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును ఎంపికచేసి వారికి మండలాల వారీగా ఆగస్టు 5వ తేదీ నుంచి 10 వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం 15వ తేదీ నుంచి వారందరూ కేటాయించిన విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు రాష్ట్ర స్థాయిలో వలంటీర్ల నియామక ప్రక్రియ పర్యవేక్షణకుగాను అధికారులతో రెండు కమిటీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నియమించారు. జిల్లాలో వలంటీర్ల ప్రక్రియ పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుధాకరరావు, కమిషనర్ ఓఎస్డీ దుర్గాప్రసాద్, స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏవో సాంబశివరావులతో కమిటీని నియమించారు. వలంటీర్ల నియామకంలో అధికారులకు తలెత్తే సందేహాలను ఈ కమిటీ నివృత్తి చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడితే జిల్లా అధికారులు వాటిని తెలియజేసిన వెంటనే పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖలో ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీజీఎస్లో పనిచేసే ముగ్గురు నిపుణులతో కలిపి మరో కమిటీని నియమించారు. అర్బన్ వలంటీర్ల నియామకానికి శ్రీకారం నవరత్నాల పథకాలను పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరవేయడానికి వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వలంటీర్‌ను నియమించనున్నారు. నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలను, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను మంజూరు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కోరింది. వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.5 వేల చొప్పున చెల్లించేందుకు ఏడాదికి రూ.486 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలి. వీరి ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో http:// wardvolunteer.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ వలంటీర్లకు సంబంధించిన షరుతులే వీరికీ వర్తిస్తాయి. -
రేపటి కేబినెట్లో ఐఆర్,సీపీఎస్ రద్దుపై నిర్ణయం
-
మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం సహా అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అధికారులు పూర్తిగా సహకరిస్తేనే ప్రజల-ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తారని, ఈ విషయంలో తాను విశ్వాసంతో ఉన్నారన్నారు. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో.. అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి.. ‘ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆదరించారంటే వాళ్లకు మాపై ఎన్నో ఆశలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాలించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ప్రణాళిక (మేనిఫెస్టో) అందరికి మార్గదర్శనం కావాలి. దీనిలో ప్రకటించిన అంశాలు అందరు అధికారులకు దిక్సూచి కావాలి. గతంలో మేనిఫెస్టోలు చేసిన ప్రభుత్వాలు.. వాటిని ఎంతవరకు అమలు చేశాయో చూపడానికే వెనుకంజ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. పారదర్శక పాలన అందించేందుకు మీ తోడ్పాటు అవసరం. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అనవసర వ్యయాన్ని తగ్గించాలి. మంచి పని తీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తాను. గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికి అనుగుణంగానే విధానాలు రూపొందించిన పరిస్థితులు ఉండేవి... కాని ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తాము. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినప్పుడు స్పష్టంగా చెప్పాను. చేసే పనులను మీ ముందు పెడతాము.. జ్యుడిషల్ కమిషన్ వేయండని కోరాను. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఇక సీబీఐ ఇక్కడ విచారణకు రావడాన్ని ఎందుకు అడ్డుకోవాలి. మంచి పాలన అందించాలనే సంకల్పంతో ఉన్నాం... సీబీఐ రావడంలో అభ్యంతరం ఏమిటి? క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టేందుకు గ్రామ వాలంటీర్లను నియమించుకుంటున్నాము. ప్రతీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ పని చేస్తారు. గ్రామ సచివాలయం కేంద్రంగా వీరంతా పని చేస్తారు. పనులు పారదర్శకంగా, అందరికి పథకాలు ప్రయోజనాలు అందాలన్నదే ఈ విధానం లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో చేపట్టబోయే సంస్కరణల గురించి అధికారులకు వివరించారు. చదవండి : సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధంగా ఉన్నాము : సీఎస్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తమతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉంది. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆకాంక్షలు నెరవేరుస్తా : సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన సందర్భంగా.. ప్రజలు, దేవుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి.. వారి ఆకాంక్షలు నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. With God’s and your blessings, I will fulfill your aspirations and live upto your expectations. https://t.co/YX4ccW8tOm — YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2019 -
‘మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు’
సాక్షి, అమరావతి : ఈనెల 8న అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరగనున్న ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇందుకు సంబంధించి సీఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవేడుకకు విచ్చేసే అత్యంత ప్రముఖులు, ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలకు కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఆయా మార్గాల గుండా సైనేజి బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పదవీ స్వీకార ప్రమాణ ప్రాంగణానికి చేరుకునే రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రచురించిన ఆహ్వాన పత్రికలకు వెనుకవైపున తెలుగులో రూట్ మ్యాప్ ను ముద్రించాలని తద్వారా ఆహ్వానితులు తదితరులు సులభంగా వేడుక ప్రాంగనానికి చేరుకునేందుకు వీలుంటుందని సీఎస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులు, మీడియాతో సహా ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే తాగునీరు, అల్పాహారం వంటివి అందించాలని, ఈఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. బందోబస్తు ఏర్పాటు, తాగునీరు, అల్పాహారం వంటివి అందించడంలో ఎంతమాత్రం రాజీపడవద్దని అదే సమయంలో అనవసర ఖర్చులకు తావీయకుండా అవసరమైన మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధింత శాఖల అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. ఈవేడుకలకు విచ్చేసిన వారు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సక్రమంగా తిలకించేందుకు వీలుగా ప్రాగణంలో సరిపడిన మేరకు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు సచివాలయం సందర్శనకు వస్తారని కావున సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో మరుగుదొడ్లు తదితర అన్నీపరిశుభ్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆయా శాఖలపరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని సీఎస్ ఆదేశించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేలా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆహ్వాన పత్రికల వెనుకవైపు ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ఏవిధంగా చేరుకోవాలనే దానిపై రూట్ మ్యాప్ ముద్రిస్తే అతిధులు తదితరులు సులభంగా ప్రాంగణాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక క్రమపద్ధతిలో సజావుగా జరిగేందుకు వీలుగా పోలీస్ శాఖ తరుపున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ 8వ తేదీ ఉ.11.49 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమానికి సుమారు 5 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 8వ తేదీ ఉదయం11.44 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, 11.45 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వేడుక ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమానికి సంబంధించి అవసరమైన వివిధ రకాల పాస్ లను ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అతిధులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులకు తేనీటి విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. -
ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలు రద్దు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంతో.. మే 25 నుంచి ప్రభుత్వ విప్ హోదాలు కోల్పోయినట్లు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తొమ్మిది మంది సభ్యులు శాసన మండలిలో పదవులను కోల్పోయారు. వీరిలో పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు ఉన్నారు. -
ఏపీలో కొనసాగుతున్న అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా లా సెక్రటరీ వెంకట రమణను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కార్యదర్శి వెంకటేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రోటోకాల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్‌బాబు డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు ఆయనను తిరిగి పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన పధకంపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఈరోజు అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. (చదవండి: సీఎం కార్యాలయంలో అధికారుల బదిలీ) -
వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ
-
వైఎస్ జగన్‌తో సీఎస్, డీజీపీ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌కు వీరు వివరించినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ మహేశ్ చంద్రలడ్డా కూడా జగన్‌ను కలిసి అభినందనలు చెప్పారు. మరోవైపు ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై కసరత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నన్ను తప్పుపట్టడం సరికాదు
-
కేబినెట్ సమావేశంపై వీడని సస్పెన్స్
సాక్షి, అమరావతి : రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 14న జరుగుతుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరగనున్న కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. కేబినెట్ సమావేశంపై సీఈసీ నుంచి అనుమతి రాలేదని సీఎంకు సీఎస్ చెప్పారు. ఈ రోజు అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించే ఆలోచనలో ముఖమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం అనుమతి కోసం ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాలని అధికారులకు సూచించారు. కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం అజెండాను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి పంపగా ఆయన ఈ నెల 10న ఈసీకి నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు సాయంత్రానికల్లా సీఈసీ నుంచి అనుమతి వస్తేనే రేపు (మంగళవారం) కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
ఈసీ అనుమతి తర్వాతే కేబినెట్ భేటీ: ఎల్వీ
-
కేబినెట్ భేటీ.. స్పందించిన సీఎస్
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కేబినెట్ భేటీకి సంబంధించి నోట్ తనకు వచ్చిందని ఆయన తెలిపారు. కేబినెట్ భేటీలో ఏయే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలని సీఎంను కోరినట్టు ఆయన తెలిపారు. ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాల్సిందిగా ఆయన సెక్రటరీకి సూచించినట్టు వెల్లడించారు. కేబినెట్ అజెండాను పరిశీలించి.. ఎన్నికల సంఘానికి పంపుతామని, ఆ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం కోరుతోందని, ఈ విషయంలో సీఎం అభిప్రాయం తీసుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. చదవండి: బాబు కేబినెట్ భేటీ.. సీఎస్ సమాలోచనలు! మళ్లీ ‘కోడ్’ పందెం -
కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా?
-
బాబు కేబినెట్ భేటీ.. సీఎస్ సమాలోచనలు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్లో భేటీ అయ్యారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ పంపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు. ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు. -
ఒడిశాకు అండగా ఉంటాం: ఏపీ సీఎస్
సాక్షి, ఢిల్లీ, అమరావతి : ఫొని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శాయశక్తులా అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒడిశా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటారన్నారు. ఆదివారం ఫొని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూలిపోయన చెట్ల తొలగింపునకు 200 పవర్ షా(కటింగ్ రంపాలు) అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామన్నారు. సోమవారం మరో 20 ట్యాంకర్లతో తాగునీరు అందజేస్తామని తెలిపారు. విద్యుత్ సేవల పునరుద్ధరణకు 1100 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే వారంతా శ్రీకాకుళంలో ఉన్నారని, అక్కడి కలెక్టర్‌తో మాట్లాడి, విద్యుత్ సిబ్బంది ఒడిశాకు తరలిస్తామన్నాని చెప్పారు. ఇనుప విద్యుత్ స్తంభాలు, 5 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన 500 సింటెక్స్ వాటర్ ట్యాంకులు అందజేయాలని ఒడిశా సీఎస్ కోరారన్నారు. వాటర్ ట్యాంకుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఇనుప విద్యుత్ స్తంభాలు తమ దగ్గర లేవని, ఏపీలో సిమెంట్‌తో తయారు చేసిన విద్యుత్ స్తంభాలే వాడుతున్నట్లు తెలిపామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఒడిశా తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15కోట్లు విరాళం ప్రకటించారు. ఛత్తీస్ఘర్ 11కోట్లు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులు తలా 10 కోట్ల విరాళాలు ప్రకటించాయి. -
చంద్రబాబు రుసరుసలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నత అధికారులపై ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఫొని తుపాను నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్‌ను సడలించడంతో చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. ‘అన్ని రాష్ట్రాలలో సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. మన దగ్గర మాత్రం ప్రధాన కార్యదర్శి సీఎం వద్దకు రారు. ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మాట్లాడాలని తెలీదా? సీఎస్‌ని రమ్మని మేము అడుక్కోవాలా. రివ్యూలకు రారా? ఇక్కడి అధికారులు చదువు కోలేదా, చట్టం తెలీదా? అధికారి ఎవరైనా బాధ్యతారహితంగా ఉంటే సహించను. వచ్చే వారం కేబినెట్ సమావేశం పెడతా. ఎన్నికల కోడ్ పేరుతో అధికారులను ఎలా ఆపుతారో చూస్తాను’ అంటూ చంద్రబాబు రుసరుసలాడారు. ఈసీ అడ్డుపడింది.. భారత వాతావరణ శాఖ కంటే ఆర్టీజీ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీజీ ద్వారా ఒడిశాకు సమాచారం ఇచ్చామని, నాలుగు జిల్లాలలో దీని ప్రభావం ఉంటుందని ముందే చెప్పామన్నారు. పక్కా ప్రణాళికతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయగలిగామని చెప్పారు. తుపాను పర్యవేక్షణ చర్యలకు ఎన్నికల సంఘం అడ్డుపడిందని చంద్రబాబు విమర్శించారు. తుపాను వెళ్లిపోయాక రివ్యూలకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ రివ్యూకు అనుమతి అవసరం లేదా అని ప్రశ్నించారు. -
సీఎస్‌పై చంద్రబాబు మరోసారి అసహనం
-
ఈ నెల మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 తుది ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్థత, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ చైర్మన్ రామచంద్రరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, ప్రవేశాల ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకంగా ఉన్న పలు అంశాలపై సీఎస్ వారితో చర్చించారు. ఫలితాల విడుదలపై తొందర అవసరం లేదని, ఏపీ ఇంటర్మీడియెట్ మార్కులతోపాటు, తెలంగాణ ఇంటర్మీడియెట్ మార్కులు కూడా వచ్చాకే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మే మూడో వారంలో ఫలితాల విడుదలకు నిర్ణయించారు. తెలంగాణ ఇంటర్ మార్కులు వచ్చాక ఎంసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల ఇంటర్ మార్కులను అందించడంలో సమస్య ఏర్పడింది. మార్కులు బయటకు వెల్లడించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో బోర్డు అధికారులు.. ఎంసెట్ అధికారులకు మార్కులు ఇచ్చేందుకు తర్జనభర్జన పడ్డారు. ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, మార్కులను ఎంసెట్ కమిటీకి అందించాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మికి సూచించారు. బయటకు వెల్లడి కావన్న షరతుతో ఈ మార్కులు అందించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఇంటర్మీడియెట్ మార్కుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామనడంతో సమస్య పరిష్కారమైంది. తెలంగాణ బోర్డు నుంచి వచ్చే వరకు నిరీక్షణ తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు తీవ్ర గందరగోళంలో పడిన నేపథ్యంలో వాటి సమాచారం ఎప్పటికి వస్తుందో అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ ఎంసెట్–2019కు మొత్తం 2,67,627 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణలో ఇంటర్ చదివినవారు 40,242 మంది ఉన్నారు. వీరిలో 14 వేల మంది వరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా తక్కినవారు అక్కడ సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇలా వేలాది సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరైనందున వారి మార్కులు కూడా వచ్చాకనే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై అక్కడి హైకోర్టు ఈ నెల 8 వరకు గడువు ఇచ్చినందున రెండో వారంలో ఆ ఫలితాలను అక్కడి బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని సీఎస్ సూచించారని సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. జూన్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించనుంది. జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జూన్ రెండో వారం నుంచి ప్రారంభించి, జూలై నాటికి ప్రవేశాలను పూర్తి చేయించి, అనంతరం తరగతుల ప్రారంభానికి వీలుగా చర్యలు తీసుకోనున్నామని ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి. -
ఫొని తుపాన్‌పై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా ఉత్తర కోస్తా మండలాల అధికారులను సీఎస్ అప్రమత్తం చేశారు. మడూ జిల్లాలకు మగ్గురు ఐఏఎస్ అధికారులను, అలాగే ప్రతి మండలానికి ఓ జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిని నియమించారు. ఫొని ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు ముందుగానే సామాగ్రి సిద్దం చేయాలన్నారు. జనరేటర్లు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపారు. మరోవైపు అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్పూర్-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తుపాన్ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. చదవండి: ఫొని తుపాను తిత్లీ కంటే ప్రమాదకరమైనది..! -
‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం
సాక్షి, అమరావతి: ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఫొని తుపాను ముప్పు పరిస్థితులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం ఢిల్లీ నుండి పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. తుపాను ప్రభావం మే 2, 3 తేదీల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా సమీక్ష సమావేశంలో వివరించారు. ఆయా రాష్ట్రాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలిగితే తక్షణ నీటి సరఫరా ఏర్పాట్లు చేసేందుకు తగిన స్టాండ్ బై జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్టుగార్డు, షిప్పింగ్, టెలికం సంస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి సిన్హా ఆదేశించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తుపాను ప్రభావం ఉండే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మెన్ అండ్ మెటీరియల్‌ను తరలించి పూర్తి సన్నద్ధతో ఉన్నామని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు వివరించారు. తుపాను ప్రభావంతో మే 3, 4 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 సెం.మీ.ల వరకూ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు వాటి పరివాహక ప్రాంతాల్లోని మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని అలాంటి చోట్ల పూర్తి అప్రమత్తతో ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే రోడ్ల వెంబడి చెట్లుపడి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే తొలగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి కొన్ని రైళ్లు నిర్దేశిత స్టేషన్లకు చేరేందుకు చాలా ఆలస్యం కావడం లేదా చిన్న చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోవడం జరుగుతుందన్నారు. అలాంటి సమయంలో ప్రయాణికులు తాగునీరు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేలా రైల్వే బోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు సూచించారు. -
ఎంసెట్ ఫలితాల్లో చిక్కుముడులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్–2019 ఫలితాల విడుదల ఓ చిక్కుముడిగా మారింది. వివిధ ఆటంకాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలలోని గందరగోళం పరిష్కారం కాకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు ఏపీ ఇంటర్ విద్యార్థులకు మార్కులు కాకుండా, గ్రేడ్లు ఇవ్వడం ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. ఏపీ ఇంటర్ గ్రేడ్లతో సమస్య ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 75 శాతంగా పరిగణించి వాటికి ఇంటర్ మార్కులను వెయిటేజీగా తీసుకుని ర్యాంకులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏపీలో కొత్తగా ఇంటర్ ఫలితాలను మార్కుల విధానంలో కాకుండా గ్రేడ్ల విధానంలో ప్రకటించారు. ఎంసెట్‌లో ర్యాంకులు ప్రకటించాలంటే ఇంటర్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా ఇంటర్ బోర్డు.. ఎంసెట్ కన్వీనర్‌కు అందించాలి. ఈ మార్కులకోసం కన్వీనర్ బోర్డుకు లేఖ రాశారు. అయితే గ్రేడింగ్‌పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున మార్కులను ఇచ్చేందుకు బోర్డు వెనుకాడుతోంది. విద్యార్థుల మార్కుల శాతాన్ని తెలుసుకొనేందుకు పార్ములాను సూచించి దాని ఆధారంగా ముందుకు వెళ్లవచ్చని సూచిస్తోంది. అయితే ఇంటర్ గ్రేడ్ల విధానం తీసుకుని ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తే గందరగోళంగా మారుతుందని ఎంసెట్ అధికారులు వాదిస్తున్నారు. మార్కులు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు బోర్డు నుంచి స్పష్టత రాలేదు. ఇక ఏపీ ఎంసెట్ రాసిన వారిలో తెలంగాణ ఇంటర్ విద్యార్థులు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఫలితాలు మే 8న విడుదలకు అవకాశముందని, ఆ తరువాత అంటే మే రెండో వారంలో ఆ మార్కులు అందిన తర్వాత ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైనా సందేహాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ పది శాతంలో 5 శాతం కాపులకు ప్రత్యేకిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నదానిపైనా ఉన్నత విద్యాశాఖలో సందేహాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాలని పేర్కొన్నా ఆమేరకు ఉత్తర్వులు లేవని ఎంసెట్ అడ్మిషన్ల అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో వేర్వేరు విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రావలసి ఉందని వివరించారు. వీటన్నిటిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
కళ్లు మూసుకుని ‘బిల్లులు’ పాస్
సాక్షి, అమరావతి: సాక్షాత్తూ శాసనసభ ఆమోదించిన గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు అసెంబ్లీ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కూడా అదే దుర్గతి పట్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు ఉన్న వాటికి రెగ్యులర్‌గా విడుదల చేయాల్సిన బిల్లులను నిలుపుదల చేయించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు బడ్జెట్ కేటాయింపులు లేని వాటికి సైతం బిల్లులను చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో రెగ్యులర్ బిల్లులను నిలిపివేసి, చంద్రబాబు సూచించిన రంగాల బిల్లులనే అధికారులు చెల్లించారు. దీంతో రెగ్యులర్‌గా చెల్లించాల్సిన రంగాల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిలో హోంగార్డుల వేతనాలు, డైట్ చార్జీలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) తదితర అత్యవసర రంగాల బిల్లులు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల బిల్లులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదిలీ అయ్యాయి. ఈ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్), ట్రెజరీ, పేఅండ్‌అకౌంట్ ఆఫీస్, వర్క్ అండ్ ప్రాజెక్టు కార్యాలయ అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత బడ్జెట్ నుంచి కొత్త కేటాయింపులు వద్దు గత ఆర్థిక సంవత్సరంలో నిధుల మళ్లింపు కారణంగా పెండింగ్‌లో పడిన బిల్లులు మొత్తం రూ.15 వేల కోట్లు ఉన్నాయని సమీక్షలో తేల్చారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన పెండింగ్ బిల్లున్నింటినీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించారు. ఇప్పుడు ఆ రూ.15 వేల కోట్ల బిల్లులు చెల్లింపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆదేశించారు. ఆ బిల్లులు చెల్లింపునకు ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. కేటాయింపులు సరిపోని పక్షంలో అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయరాదని వెల్లడించారు. కొత్త బడ్జెట్ నుంచి పాత బడ్జెట్‌కు చెందిన బిల్లులు చెల్లించడానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. తిరస్కరించిన బిల్లులు మళ్లీ వచ్చాయెందుకు? కొన్ని రంగాలకు సంబంధించి డబుల్ బిల్లులు రావడాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శలు తప్పుపట్టారు. సరిగ్గా పరిశీలన(స్క్రూటినీ) చేయకుండానే బిల్లులను పంపిస్తున్నారని, అందువల్లే డబుల్ పేమెంట్లు జరిగాయని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపులో మార్చి నెలలో వచ్చిన రూ.8 వేల కోట్ల బిల్లులను తిరస్కరించామని, ఈ బిల్లులన్నీ మళ్లీ చెల్లింపుల కోసం వచ్చేశాయని పేర్కొన్నారు. బిల్లులను తిరస్కరించి నెల రోజులు కాకుండానే మళ్లీ ఎలా తిరిగి వచ్చాయని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆయా విభాగాల అధికారులను ప్రశ్నించారు. వీటిపై మరోసారి స్క్రూటినీ చేయాలని సూచించారు. కేంద్ర పథకాలకు మొండిచెయ్యి గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించిందని సమీక్షలో తేల్చారు. ఇప్పుడు ఆ రూ.3,000 కోట్లతోపాటు రాష్ట్ర వాటాను కూడా జోడించి ఆయా పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకే బడ్జెట్ కేటాయింపులు ఉండడంతో నిధులు సరిపోవని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాలకు నిధుల విడుదలను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలకు నిధులు వ్యయం చేసి, వినియోగ పత్రాలు సమర్పిస్తే గానీ తదుపరి నిధులను కేంద్ర సర్కారు విడుదల చేయదు. ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులను మరో ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దుస్థితి గతంలో ఎన్నడూ రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని చెబుతున్నాయి. రూ.కోట్లు ఖర్చు చేసినా ‘సీఎఫ్ఎంఎస్’ నిష్ఫలమే! రూ.వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ఇప్పటికీ అక్కరకు రాలేదు. సీఎఫ్ఎంఎస్ పేరుతో ఇప్పటికే రూ.400 కోట్లు వ్యయం చేశారని, ఇప్పుడు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్ఎంఎస్ పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా లేదని ఆర్థిక శాఖ ఉద్యోగులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడు బడ్జెట్ల చెల్లింపులను సీఎఫ్ఎంఎస్లోనే చేస్తామని చెబుతూ వచ్చినప్పటికీ ఆఖరికి పాత గుడ్ గవర్నెన్స్ పోగ్రామ్‌లోనే చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మార్చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ పనితీరుపై ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మే 2న అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించాలని ఆర్థిక శాఖకార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణ నిర్ణయించారు. అయితే, అన్ని శాఖల కార్యదర్శులతో ఒకేసారి సమావేశం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, అందుకే నాలుగు విడతలుగా ఆర్థిక శాఖలోనే అంతర్గత సమావేశాలను నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. -
దాచేపల్లిలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం పార్టీ ఆఫీసు ఎదుట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దహనం చేశారు. సీఎస్ కేంద్రానికి ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనకు దిగారు. కాగా తిరుమల శ్రీవారి బంగారం విషయంలో జరిగిన అవకతవకలు, కోడ్ అమల్లో ఉండగానే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించడం తదితర విషయాలు ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇక అప్పటి నుంచి సీఎస్ లక్ష్యంగా టీడీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోని రూ. లక్షల కోట్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. -
బంగారం తరలింపులో లోపాలు నిజమే : సీఎస్
సాక్షి, అమరావతి : తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగుచూసిన లోపాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు, టీటీడీ అజాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పారు. బంగారం తరలింపులో లోపాలున్నాయన్నది నిజమేనని, శ్రీవారికి చెందిన బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని అన్నారు. బంగారం తరలింపులో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల సమీక్షలు నిర్వహించటంలో తప్పేమిటని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధలనలు ఉన్నాయని తెలిపారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై కొనసాగిన విచారణ నివేదికను ముఖ్యమంత్రికి పంపించామని తెలిపారు. (చదవండి : బంగారంపై తడబాటు ఎందుకు?) -
బాబు అనుచిత వ్యాఖ్యలు ; ఐఏఎస్‌ల భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే, తన అదుపాజ్ఞల్లో ఉండే అధికారులను బదిలీ చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. నూతన సీఎస్ కోవర్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిపై కూడా బెదిరింపులకు దిగారు. కాగా, ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రమణ్యంపై బాబు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ హరిత హోటల్లో సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల వల్ల ఐఏఎస్ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ప్రధానంగా చర్చించనున్నారు. బాబు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్ జవహర్‌రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్, పి.ఉషాకుమారి, కరికల్ వలవన్, సునీత శామ్యూల్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. బాబు వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. (సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు) -
ఐఏఎస్‌ల సంఘానికి ఏమైంది..?
-
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అన్నందుకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం వారు హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి చంద్రబాబు అనుచిత వైఖరిపై తమ నిరసన తెలియజేశారు. భవిష్యత్తులో ఇలా ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులను కించపర్చకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు ఒక లేఖను గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మాజీ ఐఏఎస్ టి.గోపాలరావు మీడియాతో మాట్లాడారు. పరిపాలనా విధుల్లో నిమగ్నమై ఉన్న ఐఏఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఒక ముఖ్యమంత్రి కోవర్టు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని అవమానించి భయపెట్టారని, ఒక ప్రధాన కార్యదర్శిపై నిందారోపణలు చేశారని, తద్వారా ఉన్నతాధికారుల ఆత్మగౌరవం దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం తమకు బాధ కలిగించిందని చెప్పారు. ఇదెంత దుర్మార్గమో ప్రజలంతా గమనించాలని గోపాలరావు కోరారు. భారత పరిపాలనా వ్యవస్థకు వెన్నెముక లాంటి ఐఏఎస్ సర్వీసుల హుందాతనాన్ని, ప్రతిష్టను నిలబెట్టేందుకు మాజీ ఐఏఎస్ అధికారులమైన తాము గవర్నర్‌ను కలిశామని వివరించారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని, తన ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని గోపాలరావు అన్నారు. ప్రభుత్వాధినేత ప్రతిష్టకే భంగం చంద్రబాబు ఐఏఎస్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఒక ప్రభుత్వాధినేతగా ఆయన ప్రతిష్టకే భంగం కలుగజేస్తుందని మాజీ ఐఏఎస్‌లు అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యం వంటి ఉత్తమమైన అధికారిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ చట్టబద్ధమైన సాధికారతనే ప్రశ్నించినట్లుగా ఉన్నాయన్నారు. గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో వారు ఈ అంశాలను పొందుపరిచారు. ఈ విషయంలో తమ మాజీ సహచరుడు ఈఏఎస్ శర్మ రాసిన లేఖ కూడా గవర్నర్ దృష్టికి వచ్చే ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజ్యాంగపరమైన అధిపతి కనుక చంద్రబాబు ప్రవర్తనను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం సముచితమని తాము భావించామని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటివి పునరావృతం కాకుండా, ప్రజల దృష్టిలో సీనియర్ ఉన్నతాధికారుల ప్రతిష్ట పలుచన చేసే ప్రయత్నాలు జరక్కుండా గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పలువురు మాజీ ఐఏఎస్‌లు సంతకాలు చేశారు. 33 మంది ఐఏఎస్ అధికారులు తమ సంఘీభావాన్ని తెలిపారు. అందుబాటులో లేనివారు ఫోన్లలో మౌఖికంగా తమ మద్దతు తెలిపారు. వీరిలో ముగ్గురు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు, 11 మంది ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. 1958, 1968, 1971, 72, 73, 1983 బ్యాచ్‌లకు చెందినవారు వీరిలో ఉన్నారు. గవర్నర్‌ను కలసిన బృందంలో గోపాలరావుతో పాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు రమాకాంత్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం, ఏకే ఫరీదా, శామ్యూల్, ఎంజీ గోపాల్, పీకే రస్తోగి, బుసి శ్యాంబాబ్, సి.ఉమామహేశ్వరరావు, బి.కృపానందం, జె.రాంబాబు తదితరులున్నారు. మద్దతు పలికిన వారిలో ఎ.భట్టాచార్య, అనిల్‌కుమార్ కుట్టి, ఎ.విద్యాసాగర్‌రావు, సీబీఎస్ వెంకటరమణ, సీవీఎస్కే శర్మ, డీఆర్ గార్గ్, డి.శ్రీనివాసులు, హరీష్‌కుమార్, జేసీ మహంతి, కేవీ రావు, ప్రియదర్శి దాస్, పి.దయాచారి, ఎంవీపీసీ శాస్త్రి, ఎంవీఎస్ ప్రసాద్, ఎన్కే నరసింహారావు, ఆర్ఎస్ గోయెల్, రేమాండ్ పీటర్, డాక్టర్ విజయకుమార్, వినోద్‌కుమార్ అగర్వాల్, జేపీ మూర్తి, సీఎస్ రంగాచారి ఉన్నారు. -
చంద్రబాబు ఒకరిని బలిపశువును చేశారు..
సాక్షి, అమరావతి: బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని, ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం నిందితుడు కాదంటూ 2018 జనవరిలోనే ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయన్నారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని తెలిపారు. ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారన్నారు. (చదవండి: సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు) -
సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలింగ్ రోజు సీఎస్.. డీజీపీ కార్యాలయానికి వెళ్లిడం ఏమిటని ఆక్షేపించారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. సీఎస్ తనకు నచ్చని పనులు ఎలా చేస్తారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న వ్యక్తి... డీజీపీ కార్యాలయానికి ఎలా వెళతారంటూ చంద్రబాబు తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల సంఘాన్ని చూడలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి ఊహకూ అందనంత సైలెంట్ వేవ్ ఉందని చంద్రబాబు చెప్పారు. అది జగన్మోహన్రెడ్డి కోసం ఉంటుందా? అని ప్రశ్నించారు. సాధారణంగా పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగి, ఆ తర్వాత పుంజుకుంటుందని, ఈసారి దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదని చెప్పారు. ఈవీఎంల సరిచేసిన తర్వాత హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఈవీఎంలు రిపేర్ చేస్తామని వచ్చిన వారు రిపేర్లు చేస్తున్నారా..? ట్యాంపర్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైనా జగన్మోహన్రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమని, మోడీ, జగన్, కేసీఆర్ వంటి వారితో పోరాడాల్సి వచ్చిందన్నారు. టీడీపీని టార్గెట్ చేసుకుని చాలా చోట్ల దాడులు చేశారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. తెలంగాణ నుంచి వచ్చే బస్సులను ఆపేశారని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం...ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్వీ సుబ్రమణ్యానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎమ్మార్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. సుబ్రమణ్యంపై సీబీఐ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని.. ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వా నిదేనని, అందులో ఏపీఐఐసీ ఎండీగా ఉన్న సుబ్రమణ్యానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలనే ఆయన అమలు చేశారని, ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొంది. న్యాయ మూర్తి జస్టిస్ బి.శివశంకరరావు గురువారం తీర్పు వెలువరించారు. అనుమతిలోనే పొరపాటు.. ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం గతేడాది మార్చి 16న హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు 169 పేజీల తీర్పు వెలువరించారు. సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చేందుకు తిరస్కరించిందని.. కానీ కేంద్రం అనుమతిని చ్చిందని అందులో పేర్కొన్నారు. ప్రాసి క్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు సరికాదనే కారణాలు వివరించ కుండానే కేంద్రం అనుమతివ్వడం సరికాదన్నారు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. సీబీఐ ఇచ్చిన చార్జిషీట్లోని అంశాలనే పరిగణనలోకి తీసుకుంటూ సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక ఎమ్మార్ భూకేటాయింపుల్లో సుబ్రమణ్యం స్వీయ నిర్ణయాలు ఎక్కడా లేవని.. కేబినెట్ నిర్ణయాలనే అమలు చేశారని స్పష్టం చేశారు. చాముండేశ్వరినాథ్‌కు విల్లా కేటాయింపుల్లో సుబ్రమణ్యం సిఫార్సు చేసినట్లుగా సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిందని తేల్చారు. ప్రాజెక్టు అమలయ్యే నాటికి ఆయన పదవిలో లేరని స్పష్టం చేస్తూ.. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేశారు. -
సార్లొస్తే కొత్త అల్లుళ్లమే..
► స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ► కడప స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి విజయవాడ స్పోర్ట్స్: ‘సార్... మా స్పోర్ట్స్ స్కూల్‌ను తనిఖీ చేయడానికి మీలాంటి సార్లొస్తే ఆ రోజుకు మేము కొత్తగా అత్తారింటికి వచ్చిన అల్లుళ్లమైపోతాం. కొత్త అల్లుళ్లు అత్త గారి ఇంటికొస్తే ఎలా చూస్తారో అలా చూస్తారు. పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు సార్. ఆ తరువాత మీరు వెళ్లిపోతే మా పరిస్థితి దారుణం. సరైన భోజనం పెట్టరు. మమ్మల్ని సరిగా పట్టించుకోరు. మొన్నటికి మొన్న శాప్ ఓఎస్డీ రామకృష్ణ గారు వచ్చారు. మమ్మల్ని భలేగా చూసుకున్నారు సార్. ఆ తరువాత మళ్లీ మామూలే. పరిగెడదామంటే సరైన ట్రాక్ ఉండదు. పలుగువేసి దిగేసినా ఆ ట్రాక్‌లో దిగదు. ఎగుడు దుగుడు ట్రాక్‌పై పరిగెత్తాలంటే మా యాంకిల్పోతోంది సార్. ట్రాక్ షూట్లు, స్పైక్‌లు, క్రీడా వస్తువులు ఇవ్వరం’టూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల్లో అథ్లెట్లకు ఏర్పాటు చేసిన సమ్మర్ రెసిడెన్షియల్ క్యాంపులో ఓ విద్యార్థి రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంపును ఆయన సందర్శించారు. క్యాంపు గురించి ఆరా తీస్తున్న ఆయనకు వైఎస్సార్ జిల్లా కడప స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి (అథ్లెట్) వివేకానంద అక్కడ పరిస్థితులను వివరించారు. దీనికి స్పందించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కడప స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి సరిగా పనిచేయకపోతే సస్పెండ్ చేయాలని ఓఎస్డీ రామకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న అథ్లెట్లతో ఫొటోలు దిగారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి క్రీడాకారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏకాగ్రతతో సాధన చేస్తే విజయవరిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. క్యాంపు కోచ్ డీఎన్వీ వినాయక ప్రసాద్‌ను అభినందించారు. కార్యక్రమానికి కళాశాల పీడీ నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పీ రామకృష్ణ, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్S కార్యదర్శి ఏవీ రా«ఘవేంద్ర, జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు, శాప్, అసోసియేషన్ కోచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రాఘవేంధ్ర , ఇతర సభ్యులు, కోచ్‌లు ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్ డిగ్రీ అందించేందుకు సిద్ధం ప్రతిగల క్రీడాకారులకు స్పోర్ట్స్ డిగ్రీ కోర్సు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర లయోల కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ అన్నారు. చైనా, క్యూబా దేశాల్లో మాదిరిగా క్రీడాకారులకు ప్రత్యేక సిలబస్‌తో విద్యనందిస్తే విద్యార్థులకు ఉపయోగమని చెప్పారు. దీనిపై జూన్ మొదటి వారంలో సమావేశమవుదామని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
నన్ను తప్పించండి: వెంగమ్మ
-
నన్ను తప్పించండి: వెంగమ్మ
తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలంటూ డాక్టర్ భూమావెంగమ్మ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు ఆమె వినతి పత్రం అందజేశారు. కొన్ని నెలలుగా స్విమ్స్‌లో జరుగుతున్న పరిణామాలపై మనస్తాపం చెందినట్టు తెలిపారు. తమకు అనుకూలమైన వారిని డైరెక్టర్ పదవిలో ఉంచడానికి అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఆమె ఆవేదన చెందారు. డెరైక్టర్, వైస్ చాన్సలర్ పదవులకు డాక్టర్ భూమావెంగమ్మ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 నుంచి స్విమ్స్ డెరైక్టర్‌గా, వైస్‌చాన్సలర్‌గా వెంగమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ స్విమ్స్ డెరైక్టర్ పదవులకు నెల ముందుగానే రాజీనామా చేస్తున్నానని, దీనిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 20వ తేదీన రాజీనామా పత్రం అందించినట్టు తెలిసింది. అయితే ఆమె రాజీనామా విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. -
కేన్సర్ బాధితుల వివరాలివ్వండి: ఎల్వీ సుబ్రమణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ బాధితుల వివరాలు విధిగా ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాల సేకరణకు నిమ్స్ కేంద్రంగా రిజిస్ట్రీ పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్పిటల్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(హెచ్‌బీసీఆర్), పేషెంట్స్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(పీబీసీఆర్) నమోదు చేయాలన్నారు. నిమ్స్ కేంద్రంగా పనిచేసే ఈ రిజిస్ట్రీ కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిధులివ్వనుంది. కేన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు విధుల్లో భాగంగానే ఈ వివరాలు ఇవ్వాలని, అయితే వీటిని గోప్యంగా ఉంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
24గంటల సేవలు
కామారెడ్డి/దేవునిపల్లి, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదాలలో గాయపడేవారికి మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం ఆయ న కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ట్రామా కేర్ కేంద్రాలు 24 గంటలపాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది, వైద్యుల కొరతతోనే ప్రస్తుతం అవి పనిచేయడం లేదన్నారు. ఈ సమస్య ను త్వరలోనే అధిగమిస్తామన్నారు. వైద్యుల నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. స్థానికంగా ఉండే ప్రత్యేక వైద్యులతో సేవలు అందిస్తున్నామని చెప్పారు. న్యూరోసర్జన్లు, సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జన్ల కొరత ఉందని పేర్కొన్నారు. ‘ఉన్నతులు’ అందుబాటులో లేకనే ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు స్థానికంగా సేవలందిం చడానికి ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎల్వీ తెలిపారు. వైద్యశాస్త్రంలో పీజీ చది విన వారు కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధన విధించిన నేపథ్యంలో 62 మంది ప్రత్యేక వైద్యులు అందుబాటులోకి రానున్నారని పేర్కొన్నారు. ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ 44 లక్షలు, పరికరాల కొనుగోలుకు రూ 61 లక్షలు మంజూరు చేశామన్నారు. ఉన్నతాధికారులు వస్తున్నారని ఆస్పత్రిని శుభ్రం చేశారని, ట్రామాకేర్ సెంటర్లో ఈరోజే పేషెంట్ల ను దింపారని విలేకరులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అన్ని వసతులు కల్పించిన తర్వాత పరిస్థితులు మెరుగుపడుతాయన్నారు. ఏరియా ఆస్పత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. టాయిలెట్ల నిర్మాణానికి బల్దియా నిధులు కేటాయించి, నిర్వహించాలని ఆ శాఖ అధికారులకు సూచించామన్నారు. ఇందూరులోనే జిల్లా ఆస్పత్రి నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిని ఎక్కడికీ తరలించబోమని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటైనందున జిల్లా వైద్యశాలను ఇతర ప్రాంతాలకు తరలించే ఉద్దేశమే లేదన్నారు. వైద్యకళాశాల ఉంటే అక్కడ మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో కలియ తిరిగి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రితోపాటు ట్రామాకేర్ సెంటర్, ఇతర విభాగాలలో సుమారు రెండు గంటలపాటు కలియతిరిగారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్య దర్శి అజయ్ సహానీ, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, వైద్య ఆరోగ్య మిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి శనివారం ఉదయం 9.30 గంటలకు ఆస్పత్రికి వచ్చారు. వీరికి కలెక్టర్ ప్రద్యుమ్న స్వాగతం పలికారు. వీరు మొదట ఏరియా ఆస్పత్రిలోని మహిళల ఇన్‌పేషెంట్ వార్డును పరిశీలించారు. పురుషుల వార్డులోనూ పర్యటించి రోగులకు అందుతున్న సేవలగురించి తెలుసుకున్నారు. ట్రామాకేర్ సెంటర్‌ను పరిశీలించారు. థియేటర్‌ను పరిశీలించి, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో వివరాలను ఆరా తీశారు. ప్రసూతి విభాగంలో రోగులతో మాట్లాడారు. ఈవోపీ, ఆరోగ్యశ్రీ విభాగం రికార్డులను పరిశీలించారు. ఏఆర్టీ సెంటర్‌ను సందర్శించి, ఎయిడ్స్ రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ సురేందర్‌రెడ్డి, ప్రొబేషనరీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ఎస్ఐలు అశోక్, సంగమేశ్వర్ బందోబస్తు నిర్వహించారు.