ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు.