సాక్షి, అమరావతి: ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా ఉత్తర కోస్తా మండలాల అధికారులను సీఎస్ అప్రమత్తం చేశారు. మడూ జిల్లాలకు మగ్గురు ఐఏఎస్ అధికారులను, అలాగే ప్రతి మండలానికి ఓ జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిని నియమించారు. ఫొని ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు ముందుగానే సామాగ్రి సిద్దం చేయాలన్నారు. జనరేటర్లు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపారు.
మరోవైపు అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్‌పూర్-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తుపాన్ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment