North Andhra Pradesh
-
ఫొని తుపాన్‌పై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా ఉత్తర కోస్తా మండలాల అధికారులను సీఎస్ అప్రమత్తం చేశారు. మడూ జిల్లాలకు మగ్గురు ఐఏఎస్ అధికారులను, అలాగే ప్రతి మండలానికి ఓ జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిని నియమించారు. ఫొని ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు ముందుగానే సామాగ్రి సిద్దం చేయాలన్నారు. జనరేటర్లు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపారు. మరోవైపు అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్పూర్-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తుపాన్ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. చదవండి: ఫొని తుపాను తిత్లీ కంటే ప్రమాదకరమైనది..! -
‘ఏపీలో మరో ప్రాంతీయ ఉద్యమం తప్పదు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రాంతీయ ఉద్యమం తప్పదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలేవీ స్థానికులకు దక్కడంలేదని, ఇక్కడి వనరుల్నిస్థానికేతరులు కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. తక్షణమే ఈ అన్యాయాలను అరికట్టకుంటే ప్రాంతీయ ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చిరంచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రకు జరుగుతోన్న అన్యాయాలపై విద్యార్ధి, యువజన, ఉద్యోగసంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటుచేసి, పోరాటాన్ని ప్రారంభిస్తామని, స్థానికులకే 85 శాతం ఉద్యోగాలు దక్కాలన్న ఆర్టికల్ 371( డి) అమలయ్యేదాకా గాంధేయ పద్ధతిలో ఉద్యమిస్తామని కొణతాల తెలిపారు. ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, మేధావులు సైతం ఈ పోరాటంలో కలిసిరావాలని కోరారు. -
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
ఉత్తరాంద్రను వణికించిన భారీ వర్షం
-
భారీ వర్షాలకు వణికిపోతున్న ఉత్తరాంధ్ర
భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. ఆరు వారం రోజులు ఎడతెరిపి లేకుండా ముంచెత్తుతున్న వర్షాలు, వరదలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆదివారం భీకర వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు 30 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం వాసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. నాగావళి నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆశించారు. 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా కన్నూరుపాలెంలో 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. కశింకోటలో 19 సెం.మీ, అనకాపల్లిలో 18 సెం.మీ, ఎస్రాయవరంలో 15 సెం.మీ వర్షం కురిసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 21, ఎస్ కోటలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
శ్రీకాకుళం జిల్లాపై ఫైలిన్ తీవ్ర ప్రభావం
ఫైలిన్ తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై చూపుతోంది. ఒడిషాలోని గోపాల్పూర్ వద్ద తుపాన్ తీరం దాటిన కాసేపటికి జిల్లాలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తుపాను ప్రభావానికి వణికిపోతున్నారు. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో ఇప్పటికే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపకపోవడం ఊరట కలిగించే విషయం. విజయనగరంపై ఓ మోస్తారు ప్రభావం చూపినా విశాఖపట్నం జిల్లాలో కాస్త తక్కువే. మిగిలిన జిల్లాల్లో అంతగా నష్టం వాటిల్లని దాఖలాల్లేవు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
తీరానికి 80 కి.మీ దూరంలో తుపాన్
ఫైలిన్ తుపాన్ ప్రభావానికి ఆంధ్రప్రదేశ్, ఒడిషా కోస్తా తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు తుపాన్ 80 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఉత్తరాంధ్రలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
9 జిల్లాలకు తుపాను హెచ్చరిక
-
9 జిల్లాలకు తుపాను హెచ్చరిక
హైదరాబాద్: వాతావరణ శాఖ 9 జిల్లాలకు తుపాను హెచ్చరిక చేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుదని చెప్పారు. సచివాలయంలో కంట్రోల్ రూం ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు 040-23451034, 23546005. ముందు జాగ్రత్తగా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒక హెలీకాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆర్మీ, నేవీ సిబ్బంది సహకారం కూడా కోరినట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని 9 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఒడిస్సా, కోస్తా జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుపాను ప్రభావం వల్ల సముద్రంలో సాదారణం కంటే అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని చెప్పారు. వాయుగుండం విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం, కళింగపట్నం, నిజాంపట్నంలలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రాత్రికి తుఫాను ఫైలిన్ తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఉత్తరాంధ్రకు తుఫాన్ ముప్పు
ఉత్తరాంధ్రతో పాటు ఒడిషాలోని కోస్తా తీరప్రాంతానికి తుఫాను ముప్పు పొంచివుంది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ఈ మేరకు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఆయన మంత్రులు, అధికారులతో బుధవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కోస్తా తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా హెలీకాప్టర్లు, పడవలు, తీరప్రాంత గస్తీ సేవల్ని అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కిరణ్‌కుమార్ రెడ్డి కోస్తా ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమ్మె వల్ల విద్యుత్ సంక్షభం నెలకొన్న నేపథ్యంలో ఆ శాఖ అధికారుల్నిఅప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వివరాలకు 040-23456005/23451034 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఈ సమావేశంలో మంత్రులు, ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.