ఉత్తరాంధ్రతో పాటు ఒడిషాలోని కోస్తా తీరప్రాంతానికి తుఫాను ముప్పు పొంచివుంది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ఈ మేరకు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఆయన మంత్రులు, అధికారులతో బుధవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కోస్తా తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.
ముందుజాగ్రత్త చర్యగా హెలీకాప్టర్లు, పడవలు, తీరప్రాంత గస్తీ సేవల్ని అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కిరణ్కుమార్ రెడ్డి కోస్తా ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమ్మె వల్ల విద్యుత్ సంక్షభం నెలకొన్న నేపథ్యంలో ఆ శాఖ అధికారుల్నిఅప్రమత్తం చేశారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వివరాలకు 040-23456005/23451034 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఈ సమావేశంలో మంత్రులు, ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రకు తుఫాన్ ముప్పు
Published Wed, Oct 9 2013 4:01 PM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement