కేన్సర్ బాధితుల వివరాలివ్వండి: ఎల్వీ సుబ్రమణ్యం | Government to declare of Cancer patients details should be given from hospitals | Sakshi
Sakshi News home page

కేన్సర్ బాధితుల వివరాలివ్వండి: ఎల్వీ సుబ్రమణ్యం

Published Sat, May 3 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Government to declare of Cancer patients details should be given from hospitals

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ బాధితుల వివరాలు విధిగా ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాల సేకరణకు నిమ్స్ కేంద్రంగా రిజిస్ట్రీ పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్పిటల్ బేస్‌డ్ కేన్సర్ రిజిస్ట్రీ(హెచ్‌బీసీఆర్), పేషెంట్స్ బేస్‌డ్ కేన్సర్ రిజిస్ట్రీ(పీబీసీఆర్) నమోదు చేయాలన్నారు. నిమ్స్ కేంద్రంగా పనిచేసే ఈ రిజిస్ట్రీ కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిధులివ్వనుంది. కేన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు విధుల్లో భాగంగానే ఈ వివరాలు ఇవ్వాలని, అయితే వీటిని గోప్యంగా ఉంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement