హీరో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి నిర్వాహకులు క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో మానసిక వికాసాన్ని కలగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా విజయ్ నటించిన లియో చిత్రాన్ని వారికి చూపించే ప్రయత్నం చేశారు.
పీవీఆర్ సంస్థ సహకారంతో లియో చిత్రం ప్రదర్శింపబడుతున్న చైన్నెలోని థియేటర్‌లలో 4,500 టిక్కెట్లను కొనుగోలు చేసి ఆదివారం క్యాన్సర్ రోగులను చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్ జగనాధన్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు. తొలి దశలో వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఈ వ్యాధిపై అవగాహన కలిగించడంలో భాగంలో క్యాన్సర్ రోగులను, వారి కుటుంబ సభ్యులకు లియో చిత్రాన్ని చూపించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment