విజయ్‌తో ఛాన్స్‌ కొట్టేసిన తెలుగు సినిమా హీరోయిన్‌ | Actress Malvika Sharma Get Chance To Act With Thalapathy Vijay In His Upcoming Movie, Rumours Viral - Sakshi
Sakshi News home page

విజయ్‌తో ఛాన్స్‌ కొట్టేసిన తెలుగు సినిమా హీరోయిన్‌

Dec 15 2023 12:38 PM | Updated on Dec 15 2023 2:13 PM

Actress Malvika Sharma Chance Get Vijay Movie - Sakshi

కోలీవుడ్‌లో దళపతి విజయ్‌ సరసన నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్‌ కైనా లక్కీ చాన్సే అవుతుంది. ఆయనతో ఒక చిత్రంలో నటిస్తే చాలు పాపులర్‌ అయిపోతారు. అలాంటి లక్కీ అవకాశం ఓ యువ నటికి వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతుంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా కుమ్మేసింది అనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈయన తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తోంది.

నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌ జీ, నటి స్నేహ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ముందుగా చెన్నైలో కొంత భాగాన్ని చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర ఆ తర్వాత థాయ్‌ ల్యాండ్‌ లో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇందులో మరో ముఖ్య పాత్రలో నటి మాళవిక శర్మ నటించబోతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. ఈమె ఇంతకుముందు తెలుగులో రామ్‌ సరసన రెడ్‌, రవితేజతో నేల టిక్కెట్టు చిత్రాలలో నటించారు.

అదేవిధంగా సుందర్‌.సి దర్శకత్వంలో కాఫీ విత్‌ ఖాదల్‌ చిత్రంలో నటించారు. కాగా ఈమె పేరుతో సామాజిక మాధ్యమాల్లో విజయ్‌ 68వ చిత్రంలో నటిస్తున్నట్లు పోస్ట్‌ చేశారు. దీంతో మాళవిక శర్మ విజయ్‌ సరసన నటించబోతున్నట్లు ప్రచారం హల్‌ చల్‌ చేస్తోంది. ఇదే దీనికి సంబంధించి చిత్ర వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా విజయ్‌ 68వ చిత్రం సన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తరెకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది వాస్తవం కాదని ఈ చిత్రం పక్కా కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement