'లియో' రిలీజ్.. దక్షిణాఫ్రికా వెళ్లిపోయిన దళపతి విజయ్! | Thalapathy Vijay's 68th Movie Shooting In South Africa | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: 'లియో' రిలీజ్.. దక్షిణాఫ్రికాలో దళపతి విజయ్!

Oct 22 2023 4:41 PM | Updated on Oct 22 2023 4:49 PM

Thalapathy Vijay 68th Movie Shooting In South Africa - Sakshi

దళపతి విజయ్‌ 'లియో' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం 3 రోజుల్లోనే రూ.32 కోట్ల వరకు వచ్చాయని అధికారికంగా ప్రకటించారు. 

(ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి)

మరోవైపు 'లియో' టీమ్ ఎవరికి వాళ్లు తమ తమ కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోతున్నారు. లోకేష్‌ కనకరాజ్‌.. రజనీతో చేయబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్స్‌ పనిలో ఉన్నాడు. విజయ్‌ కొత్త మూవీ షూటింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఈయన హీరోగా,  వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. కీలక సన్నివేశాల్ని అక్కడ తీస్తున్నారు.

ఇకపోతే దళపతి 68వ మూవీలో స్నేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయరామ్‌, ప్రభుదేవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు. ఇటీవలే చైన్నెలో షూటింగ్ ప్రారంభించారు. ఓ పాట పూర్తిచేశారు. ఆ తర్వాతే సౌతాఫ్రికా వెళ్లిపోయి షూటింగ్‍‪‌లో బిజీ అయిపోయారు.

(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement