రైతుల్ని ఆదుకోండి: పొన్నాల | ponnala fires on telangana govt over the farmers issues | Sakshi
Sakshi News home page

రైతుల్ని ఆదుకోండి: పొన్నాల

Published Mon, Apr 3 2017 6:59 PM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM

రైతుల్ని ఆదుకోండి: పొన్నాల - Sakshi

రైతుల్ని ఆదుకోండి: పొన్నాల

హైదరాబాద్‌సిటీ: రాజకీయ కోణంలో చూడకుండా రైతులను ఆదుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలపై ఇతర కాంగ్రెస్‌ నేతలతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. కష్టాల్లో ఉన్నరైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రజా సమస్యలపై కలవటానికి కూడా సీఎం అవకాశం ఇవ్వటం లేదని విమర్శించారు. మార్కెట్ యార్డులో మిర్చిని రైతులు కలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కందుల ధర భారీగా పడిపోయిందని, మార్కెట్ యార్డులో కనీసం గొనె సంచులు లేవని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పొన్నాల విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement