మున్సిపల్ లీజునిబంధనలపై మంత్రుల కమిటీ | Government appointed a committee on municipal terms of lease | Sakshi
Sakshi News home page

మున్సిపల్ లీజునిబంధనలపై మంత్రుల కమిటీ

Published Fri, Nov 22 2013 12:22 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

Government appointed a committee on municipal terms of lease

సాక్షి, హైదరాబాద్: మంత్రుల కమిటీ మాటున మున్సిపల్ లీజు స్థలాలను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగరాల్లోని మున్సిపల్ స్థలాలు, దుకాణాల్లో తిష్టవేసిన వారికి ఆ స్థలాలను కట్టబెట్టడానికి ఓ మంత్రి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ స్థలాలను ప్రస్తు తం ఉంటున్న వారికే 25 ఏళ్లకు పైబడి లీజు కు ఇవ్వాలని, లేనిపక్షంలో  విక్రయించాలంటూ ఓ మంత్రి చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే 25 సంవత్సరాలకు మించి లీజు ఇవ్వడానికి లేదని, దానిపై హైకోర్టు తీర్పుతో పాటు పూర్తి మార్గదర్శకాలు ఉన్నాయని పురపాలక  శాఖ అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ నిబంధనలపై సమీక్షించి నివేదిక ఇవ్వాలం టూ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో రెవెన్యూ, మున్సిపల్, కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారని, వీరు లీజు విధానాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement