వెరైటీ టైటిల్తో కీ అండ్ కా ' | Ki and Ka' shows genders don't matter: R. Balki | Sakshi
Sakshi News home page

వెరైటీ టైటిల్తో కీ అండ్ కా '

Published Thu, Jul 30 2015 2:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వెరైటీ టైటిల్తో కీ అండ్  కా ' - Sakshi

వెరైటీ టైటిల్తో కీ అండ్ కా '

కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం

ముంబై: బాలీవుడ్లో ఓ చిత్రమైన టైటిల్తో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జెండర్ సమానత్వాన్ని ప్రబోధించే  ఈ మూవీకి  వెరైటీగా  'కీ అండ్  కా ' అని పేరుపెట్టారు దర్శకనిర్మాతలు. సినిమా విశేషాలను దర్శకుడు బాల్కీ వెల్లడించారు. హిందీలో భాషలో మనుషులతోపాటూ వస్తువులకు  కూడా జెండర్ ఉందన్నారు. కానీ  'కీ అండ్  కా ' సినిమాకు లింవివక్ష లేదని, సినిమా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రభోదిస్తుందని తెలిపారు.


విరుద్ధభావాలు కల  అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీ  2016  సమ్మర్లో   ప్రేక్షకుల  ముందుకు  రానుందని తెలిపారు.  భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్,  జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే  లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో  కరీనా  కపూర్ నటిస్తున్నారని చెప్పారు.


మరోవైపు అర్జున్ కపూర్,  కరీనాకపూర్  తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  కూడా ఒక ప్రధానపాత్రలో  కనిపించనున్నారట.  ఇంతకుముందు  బాల్కి దర్శకత్వంలో చీనీ కం, పా, షమితాబ్ సినిమాల్లో నటించారు బిగ్ బి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement