బాహుబలి-2 రికార్డుకు దంగల్ ఎసరు!
⇒ చైనాలో రూ.650 కోట్ల వసూళ్లు
హైదరాబాద్: భారత్‌లో రికార్డులు తిరగరాసిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో ప్రభంజనం సృష్టిస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మూడో వారాంతానికి వంద మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 649.03 కోట్లు) మార్క్‌ను చేరుకుంది. తద్వారా చైనాలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారత తొలి సినిమాగానూ నిలిచింది. దీనిపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మూడో వారాంతానికి చైనాలో దంగల్ మూవీ వంద మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందని ట్వీట్లో పేర్కొన్నాడు.
గత శుక్రవారం 6.02 మిలియన్ డాలర్లు, శనివారం రూ.16.16 మిలియన్ డాలర్లు రాబట్టింది. తద్వారా 100.69 మిలియన్ డాలర్ల (రూ.649.03 కోట్లు) మైలురాయిని సాధించింది. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి 2’ విడుదలకు ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొనసాగించింది. భారత్ కంటే చైనాలోనే దంగల్ మూవీ అధిక కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో మూవీగా నిలిచిన 'దంగల్' చైనాలో రికార్డు వసూళ్లతో 1500 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. దంగల్ హవా ఇలాగే కొనసాగితే బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.
#Dangal crosses $ 100 million in China... Week 3:
— taran adarsh (@taran_adarsh) 21 May 2017
Fri: $ 6.02 mn
Sat: $ 16.16 mn
Total: $ 100.69 million [₹ 649.03 cr]
HUMONGOUS ACHIEVEMENT