
దంగల్ దర్శకుడు నితీష్ తివారీకి స్వీట్ షాక్ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ముందస్తు సమాచారం లేకుండా తివారీ ఇంటికెళ్లాడు. ఇందులో షాక్ ఏముందని అనుకుంటున్నారా? ఆమిర్ ఉండేది ముంబైలో. నితీష్ తివారీ ఉండేది ఢిల్లీలో. సడెన్‌గా తన ఇంటి ముందు ఆమిర్‌ను చూసిన నితీష్ తివారీ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆమిర్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నితీష్ తివారీ. దంగల్ తర్వాత వీరి కలయికలో చిచ్చోరే అనే టైటిల్‌తో సినిమా రాబోతోందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమిర్ సినిమా గురించి చర్చించడానికి వెళ్లాడా? లేక పలకరిద్దామని వెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment