Kriti Sanon recalls being told 'no one wants to marry an actress by friends - Sakshi
Sakshi News home page

Kriti Sanon : 'హీరోయిన్లను పెళ్లి చేసుకోవడానికి  ఎవరూ ముందుకు రారు..  అలాంటివి విన్నాను'

Published Fri, Mar 10 2023 11:22 AM | Last Updated on Fri, Mar 10 2023 12:05 PM

Kriti Sanon Recalls Being Told No One Wants To Marry An Actress By Friends - Sakshi

'వన్ నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్‌ కృతిసనన్‌. తొలి సినిమా తెలుగులో చేసినా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్‌ అయిపోయింది ఈ భామ. ప్రభాస్‌తో డేటింగ్‌ రూమర్స్‌తో బాగా పాపులర్‌ అయిన కృతిసనన్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్‌ పెళ్లిళ్లపై ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

కృతి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు త్వరగా పెళ్లిళ్లు కావనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. వాస్తవానికి చాలామంది.. హీరోయిన్స్‌ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నటించడం అనేది వాళ్ల వృత్తిలో భాగమేనని ఇప్పటికీ అంగీకరించడం లేదు. 

నా కెరీర్‌ ఆరంభంలో నాఫ్రెండ్స్‌ నుంచి కూడా ఇలాంటి కామెంట్స్‌ విన్నాను. హీరోయిన్స్‌ను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు అని చెప్పి నన్ను భయపెట్టాలని చూశారు. కానీ నేను వాటిని అంత సీరియస్‌గా తీసుకోకుండా హీరోయిన్‌గా సక్సెస్‌ కావడంపైనే దృష్టిపెట్టాను. ఇప్పుడు నేను కోరుకున్న కెరీర్‌లో రాణిస్తున్నాను' అంటూ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement