బీజింగ్: స్టాండప్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ విషయాలలో సైతం హ్యస్యాన్ని జోడించి అందరిని నవ్విస్తుంటారు. ప్రజలు కూడా ఈ షోలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే స్టాండప్ కమెడీయన్‌లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఒక్కోసారి జోకులు హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రేక్షకులను నవ్వించడానికి ఓ చైనా కమెడియన్ వేసిన జోక్ ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహానికి గురికావడంతో పాటు భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లోలీ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో హవోషి అనే స్టాండప్ కమెడియన్ తన ప్రదర్శన ఇచ్చాడు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఆ షో సాగుతోంది. అంతలో తాను షాంఘైకి వెళ్లిన సమయంలో వీధి కుక్కలను దత్తత తీసుకున్న కథనాన్ని వాళ్లకి వివరిస్తూ.. చైనా సైన్యం (పీఎల్‌ఏ) చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఈ జోక్‌కు విపరీతంగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ.. ఆ షో పూర్తన తర్వాత ఆ జోక్ అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు దానిపై అభ్యంతరాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ జోక్‌పై ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన సదరు కమెడియన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కమెడియన్ వేసిన జోక్ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందంటూ చైనా సాంస్కృతిక శాఖ పేర్కొంటూ సదరు కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల (సుమారు రూ.17కోట్లు) జరిమానా విధించింది.
చదవండి: మీడియా అత్యుత్సాహం.. హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు.. కొద్దిలో తప్పిన రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment