
బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని, దయచేసి అందరూ అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండంటూ నటుడి సన్నిహితుడు సునీల్ పాల్ ఓ వీడియో షేర్ చేశాడు.
జిమ్ చేస్తూ ఇటీవల గుండెపోటుకు గురైన కమెడియన్, నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స అందుకుంటున్న అతడి బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని, దయచేసి అందరూ అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండంటూ నటుడి సన్నిహితుడు సునీల్ పాల్ ఓ వీడియో షేర్ చేశాడు. కాగా రాజు శ్రీవాస్తవకు ఆగస్టు 10న గుండెపోటు రాగా అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది!
భారీ ఆఫర్‌ను వదులుకున్నా.. ఎమోషనల్ అయిన ఛార్మి