
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్‌గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్‌ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్‌గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్.
Comments
Please login to add a commentAdd a comment